NTV Telugu Site icon

Karnataka Elections : కర్ణాటకలో ముగిసిన ఎన్నికల ప్రచారం..

Elections

Elections

కర్ణాటక అసెంబ్లీ 2023 ఎన్నికల ప్రచారం ముగిసింది. గత కొన్ని రోజులుగా మూడు ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నుంచి ముఖ్య నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మరోవైపు ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నంలో భాగంగా ర్యాలీలు, రోడ్ షోలు కూడా నిర్వహించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పార్టీల మధ్య సవాళ్లకు ప్రతి సవాళ్ల విసురుకుంటూ పలువురు నేతలు విమర్శలకు దిగారు.

Also Read : RGV: ది కేరళ స్టోరీ సినిమాపై వర్మ రివ్యూ.. ఏమన్నాడంటే..?

అయితే కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా 113 అసెంబ్లీ స్థానాలు గెలవాలి. ఇక మొత్తం 224 సీట్లలో 36 సీట్లు ఎస్సీ, 15 ఎస్టీ తెగలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ నేపథ్యంలో మే 10న కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కోసం ఓటింగ్ జరుగనుంది. అసెంబ్లీకి ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి అని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. మే 13న తుది ఫలితాలు వెల్లడికానుండగా.. మే 24తో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగియనుంది.

Also Read : NASA : స్పేస్ సెంటర్‌ను కూల్చివేసేందుకు నాసా ప్లాన్..

మరోవైపు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి పెద్దలు ఆటుపోట్లను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఆశిస్తున్నారు. మరోవైపు 1985 నుంచి కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని చూస్తోంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ పార్టీ సైతం వారి ప్రజాదరణ చూసి గెలుస్తారనే ధీమాను వ్యక్తం చేస్తుంది.

Also Read : Manipur Telugu Students : హైదరాబాద్‌కు చేరుకున్న మణిపూర్‌ తెలుగు విద్యార్థులు

ఈ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోదీ ఏకంగా ఆరు రోజుల పాటు దాదాపు 15 బహిరంగ సభలు, రోడ్‌షోలలో పాల్గొన్నారు. దీంతో పాటు ప్రాంతీయ పార్టీ జేడీఎస్ తరపున కుమారస్వామి సైతం స్థానికంగా గట్టి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ పార్టీ నేతలు కూడా వారి ప్రాంతాల్లో గెలుపుపై ఆశాభావంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ఓటర్లు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే మరికొన్ని రోజులు నిరీక్షించాల్సిందే..