ప్రేమ కోసం ఎంతదూరమైన వెళ్లి తమ లవ్ ను సాధించేందుకు ప్రేమికులు వెళ్తుంటారు.. ఈ ప్రేమకు.. ఎల్లలు లేవు.. హద్దులు లేవు.. ఎంత దూరమైన తీసుకెళ్తుంది. మనం ఈ మధ్య తరుచుగా వార్తల్లో చూస్తునే ఉన్నాం.. ఇక్కడి అబ్బాయిలు పరాయి దేశం అమ్మాయిలపై మనుసుపడి పెళ్లిళ్లు చేసుకొని సంతోషంగా ఉంటున్నారు. సేమ్ అలాంటి సీన్ ఇప్పుడు జగిత్యాల జిల్లా మల్యాల మండలం అబ్బాయి.. అమెరికా అమ్మాయి ప్రేమించుకొని హిందూ సంప్రదాయం ప్రకారం ఏడడుగులు వేశారు.
Also Read : Venugopala Krishna: ఈసారి పెన్షన్ల పంపిణీ ఏప్రిల్ 3నే.. ఎందుకంటే?
మల్యాల మండలానికి చెందిన ముస్కెం నర్సయ్య కుమారుడు ప్రభు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. తనతో పాటు ఉద్యోగం చేస్తున్న అమెరికాలోని టెక్సాస్ కు చెందిన సెసీలియ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జగిత్యాల పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో వీరి విహానం సోమవారం జరిగింది. ఇలానే ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తోంది.
Also Read : Chada Venkat Reddy : కేంద్రంలో, రాష్టంలో పార్టీ జెండాలు మారిన పేదల బతుకులు మాత్రం మారలేదు
మొన్న ఆదిలాబాద్ జిల్లా, నిన్న నిజామాబాద్ జిల్లా, ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఈ సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా, లండన్, జపాన్ ఇలా ఇతర దేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడి అక్కడి అమ్మాయిలను ఇక్కడికి తీసుకొచ్చి హిందూ సంప్రదాయ పద్దతిలో మ్యారేజ్ చేసుకుని మళ్లీ పరాయి దేశం వెళ్లి అక్కడే స్థిరపడిపోతున్నారు. అలా అని ఇక్కడి అమ్మాయిలు అక్కడి అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం లేదని కాదు.. అలాంటి సంఘటనలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి.