Site icon NTV Telugu

Karimnagar: హృదయ విదారక ఘటన.. తండ్రి చితికి నిప్పు పెట్టిన కూతురు..

Karimnagar

Karimnagar

కరీంనగర్ జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కూతురి పెళ్లి కోసం చేసిన అప్పు ఓ వైపు మరో ఇద్దరు కూతుళ్ల వివాహం చేయాలనే మనోవేదన మరో వైపు ఎం చేయాలో తెలియని పరిస్థితుల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురు చితికి నిప్పు పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసిన తీరు గ్రామంలో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది.

READ MORE: Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం స్పాన్సర్ చేసిందా..? క్లారిటీ ఇచ్చిన టూరిజం శాఖ మంత్రి..

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన పెద్ద సమ్మయ్య – సుగుణ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురు శృతి వివాహం గత ఐదు సంవత్సరాల క్రితం కాగా మిగతా ఇద్దరు కూతుళ్లు పల్లవి, అక్షయ చదువుకుంటున్నారు. పెద్ద కూతురు వివాహానికి దాదాపు ఆరు లక్షల అప్పు చేశాడు సమ్మయ్య. సమ్మయ్యకు మూడెకరాల బీడు భూమి ఉంది. ఇదే భూమి లో వ్యవసాయం చేస్తూ కూలి పనులకు వెళ్ళి వచ్చిన డబ్బులతో అప్పు తీరక మరో ఇద్దరు కూతుళ్ల వివాహం చేయాల్సి ఉందనే మనస్థాపంతో గత నెల 29 న పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురు తండ్రి చితికి నిప్పు పెట్టి అంతక్రియలు పూర్తి చేసింది. ముగ్గురు కూతుళ్లు తండ్రి కోసం ఏడుస్తున్న తీరు గ్రామస్థులను కంట తడి పెట్టించింది.

READ MORE: UP: పెళ్లి రోజు నైట్ బెడ్‌రూంలో భర్త లోపాన్ని గుర్తించిన భార్య.. అత్తామామలకు విషయం చెప్పడంతో..

Exit mobile version