Kapildev: టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఈ ఇద్దరు దిగ్గజాలు పెద్ద తప్పు చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ దిగ్గజం, 1983 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీల టెస్ట్ రిటైర్మెంట్ నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం పెద్ద తప్పిదమని ఆయన అభిప్రాయపడ్డారు. జూన్ 2025లో టెస్టులకు వీడ్కోలు పలికిన కోహ్లీ, ఇటీవల నవంబర్ 6న టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ ఇద్దరూ తమ అనుభవంతో మరికొన్ని సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ ఆడేవారని కపిల్ పేర్కొన్నారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కపిల్ దేవ్, ఆటగాళ్లు కోపంతో లేదా తొందరపడి రిటైర్మెంట్ ప్రకటించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. కేవలం దేశవాళీ లేదా ఇతర లీగ్‌ల కోసం టెస్టులను వదులుకోవడం సరికాదన్నారు. భువనేశ్వర్ కుమార్ లాంటి ఆటగాళ్లే నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తుండగా, అత్యుత్తమ ఫిట్నెస్ కలిగిన కోహ్లీ ఇంకా చాలా కాలం ఆడగలగాల్సిందని అభిప్రాయపడ్డారు. 25 ఏళ్ల యువ క్రికెట్రికే సైతం ఫిట్‌నెస్‌లో సవాలు విసిరే స్థాయి ఉన్న కోహ్లీ, టెస్ట్ రిటైర్మెంట్ నిర్ణయంపై కచ్చితంగా పదేళ్ల తర్వాత పశ్చాత్తాప పడాల్సి వస్తుందని హెచ్చరించారు.
Also Read
- Imran Khan: ‘‘ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు’’.. నిస్సహాయ స్థితిలో ఇమ్రాన్ ఖాన్ లేఖ!
- INDIA Bloc: ఎన్నికల సంఘానికి 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టులో INDIA కూటమి పిటిషన్!
- AP Elections: ముగిసిన 23 పట్టణ స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం.. రేపు పరిశీలన..
- Dating App Crime: డేటింగ్ యాప్ వేదికగా వల.. ఇళ్లకు వెళ్లి మత్తు ఇచ్చి దోపిడీలు..
షమీ విషయానికి వస్తే.. ఎంత కష్టమైనా సరే మరో రెండు సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ ఆడే అవకాశం ఉంటే వదులుకోకూడదని కపిల్ సూచించారు. సెలెక్టర్లు ఎంపిక చేయకపోయినా, మైదానంలో ఆడుతూ ఉంటే మళ్లీ అవకాశం వచ్చే తలుపులు తెరిచే ఉంటాయని తెలిపారు. కెరీర్లో ఎన్నిసార్లు ఇబ్బందులు ఎదురైనా పట్టు వదలకండా పోరాడిన మోహిందర్ అమర్నాథ్ స్పూర్తిని ఆటగాళ్లు అలవర్చుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుత తరంలో కొద్దిగా ఓపిక నశించి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని, దేశం కోసం ఆడే అత్యున్నత ఫార్మాట్‌ను ఎవరూ త్వరగా వదులుకోకూడదని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Kapildev: టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఈ ఇద్దరు దిగ్గజాలు పెద్ద తప్పు చేశారు..
-
Imran Khan: ‘‘ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు’’.. నిస్సహాయ స్థితిలో ఇమ్రాన్ ఖాన్ లేఖ!
-
Love Story: అనిరుధ్ మామ కళానిధి మారన్ ప్రేమ కథ తెలుసా?
-
INDIA Bloc: ఎన్నికల సంఘానికి 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టులో INDIA కూటమి పిటిషన్!
-
Mouli: టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు దొంగ నా కొడుకు .. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ బ్యానర్లో మూడో సినిమా?
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!