ప్రస్తుత తరం క్రికెటర్లపై టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్ విమర్శలు గుప్పించారు. తమకు అంతా తెలుసని వారు అనుకుంటున్నారు.. కానీ వారికి ఏం తెలియదు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం ఉండటం మంచి విషయమే.. అయితే ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకుందామనే తపన వారిలో లేకపోవడం నెగెటివ్ పాయింట్ అని కపిల్ దేవ్ అన్నాడు. ఇలా తయారు కావడానికి ప్రధానంగా డబ్బు, పొగరు, అహం అనే మూడు అంశాలేనని ఆయన పేర్కొన్నారు.
Read Also: Undavalli Arun Kumar: పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు.. ఇంకా పునాదుల్లోనే ఉంది
గ్రౌండ్ లో సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజం ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడి సలహాలను తీసుకోవడానికి వీరికి అభ్యంతరం ఏమిటని కపిల్ దేవ్ ప్రశ్నించారు. 50 సీజన్ల క్రికెట్ ను చూసిన గవాస్కర్ తో మాట్లాడేందుకు ఈ తరం క్రికెటర్లకు నామోషీ ఎందుకని ఆయన అడిగారు. తమకు అంతా తెలుసుని వారు అనుకుంటుంటారని.. అయితే నిజానికి వారికి ఎమ్ అంతా తెలియదని చెప్పారు. అప్పటి, ఇప్పటి ఆటగాళ్లలో వ్యత్యాసం ఉండడం కామన్.. ప్రస్తుత తరం ప్లేయర్లలో గొప్ప విషయం ఏంటంటే వారంతా ఆత్మవిశ్వాసంతో ఆడటం అని ఆయన అన్నారు.
Read Also: Virat Kohli: ఛీ.. ఇదేం ఖర్మ రా బాబు.. ఆఖరికి విండీస్ చేతిలో కూడానా..
ఈ ఆటగాళ్లు నెగటివిటీని పట్టించుకోరు.. ఇదే సమయంలో మేం ఎవరిని ఏమి అడగాల్సిన అవసరం లేదనుకుంటారు అందుకే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చారు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌తో పాటు కాసులు కురిపించే ఇండియప్ ప్రీమియర్ లీగ్ లో ఒక్క సీజన్ ఆడినా చాలు భారీ మొత్తంలో డబ్బులు దక్కించుకోవచ్చనే భ్రమలో ప్రస్తుత తరం ఆటగాళ్లు బ్రతికేస్తున్నారు అని కపిల్ దేశ్ అన్నారు. ఏదో ఒకరోజు తిరిగి వారికే దెబ్బకొట్టే అవకాశముందని.. అయితే, ఈ తరం ఆటగాళ్లు డబ్బు, అహంకారంతో బతికేస్తున్నారని కపిల్ దేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.