కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఫిల్మ్ కాంతార. జీరో ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమా శాండిల్ వుడ్ టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుతో పాన్ ఇండియా లెవల్లో శాండిల్ వుడ్ తన స్థాయిని పెంచుకునేందుకు గట్టిగానే ప్లాన్ చేసాడు రిషబ్. థింగ్ బిగ్ అనే కాన్సెప్టుతో కాంతార ప్రీక్వెల్ ను తెరకెక్కించాడు. ఈ సినిమాను అత్యంత ప్రెస్టిజియస్ ప్రాజెక్టుగా టేకప్ చేసిన రిషబ్ శెట్టి.. ఎన్ని సమస్యలొచ్చినా అధిగమించి షూట్ ఫినిష్ చేసాడు.
Also Read : JR NTR : వార్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు ఎక్కడంటే
రిషబ్ శెట్టి హీరో కం దర్శకుడిగా డ్యూయల్ రోల్ పోషించిన కాంతార చాప్టర్ వన్ అక్టోబర్ 2న దసరా కానుకగా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. తెలుగులో ఈ సినిమా రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంతారను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇక నైజాం రైట్స్ ను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మైత్రీ సంస్థ కొనుగోలు చేసింది. అయితే ఇటీవల టాలీవుడ్ లో ఎర్లీ ప్రీమియార్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల వచ్చిన OG సినిమాను కూడా ఒక రోజు ముందు ప్రీమియార్స్ తో విడుదల చేసారు. ఇప్పుడు రాబోతున్న కాంతార చాప్తర్ 1 ను కూడా ఒకరోజు ముందుగా అనగా అక్టోబరు 1న రాత్రి ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. అటు ఏపీలో ఈ సినిమాకు రూ. 50 అదనపు టికెట్ ధర పెంచారు. అందుకు అనుగుణంగా అనుమతులు రాబోతున్నాయి.