Darshan bail cancelled: రేణుకా స్వామి అనే వ్యక్తి హత్య కేసు కన్నడనాట సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈకేసులో కన్నడ నటుడు దర్శన్ జైలు జీవితం కూడా గడిపారు. తాజా ఈ కేసుకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది. రేణుకస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ బెయిల్‌ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులో చాలా లోపాలు ఉన్నాయని పేర్కొంటూ జస్టిస్ జెబి పార్దివాలా, ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో అప్రమత్తమైన బెంగళూరు పోలీసులు తీర్పు వెలువడిన గంటల వ్యవధిలోనే వీరిద్దరినీ అరెస్టు చేశారు. ముందుగా పవిత్రా గౌడను ఆమె ఇంట్లో కస్టడీలోకి తీసుకోగా, దర్శన్‌ను హొసకెరెహళ్లిలోని తన భార్య ఇంట్లో అరెస్టు చేసినట్టు సమాచారం.
READ MORE: Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఘోరం.. జవాన్‌లు సహా 33 మంది మృతి.. 220 మందికి పైగా గల్లంతు..!
డిసెంబర్‌లో బెయిల్..
కన్నడ సినీ నటి పవిత్రకు అసభ్య సందేశం పంపాడన్న కారణంతో చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి హత్య చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు విచారణలో భాగంగా దర్శన్, ఆయన స్నేహితురాలు పవిత్రగౌడ సహా 15 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో గతేడాది డిసెంబర్‌లో కర్ణాటక హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. దీన్ని రద్దు చేయాలని కోరుతూ కర్ణాటక పోలీసులు గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. నిందితులను కస్టడీలోకి తీసుకొని త్వరగా విచారణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం అధికారులను ఆదేశించింది.
జూన్ 11, 2024న అరెస్టు..
కన్నడ స్టార్ దర్శన్‌కు వీరాభిమాని అయిన రేణుకాస్వామి నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2024 జూన్‌లో దర్శన్ రేణుకాస్వామిని అపహరించి, బెంగళూరులోని షెడ్లో మూడు రోజుల పాటు హింసించి, అనంతరం అతని శవాన్ని డ్రెయిన్లో పడేశారు. ఈకేసు విచారణలో భాగంగా పోలీసులు దర్శన్‌ను జూన్ 11, 2024న అరెస్టు చేశారు. ఆయన దాదాపు 7 నెలలు జైలులో ఉన్నారు. తరువాత, డిసెంబర్ 13, 2024న ఆయనకు బెయిల్ మంజూరు అయ్యింది.
తాజా సుప్రీం కోర్టు ఈ బెయిల్ మంజూరుపై స్పందించి తీర్పు వెలువరించింది. ‘బెయిల్ మంజూరు, బెయిల్ రద్దుతో సహా ప్రతి అంశాన్ని మేము పరిగణనలోకి తీసుకున్నాము. హైకోర్టు ఉత్తర్వులో తీవ్రమైన లోపభూయిష్టత ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఇది యాంత్రిక ప్రక్రియను ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా, హైకోర్టు విచారణకు ముందు దశలో మాత్రమే విచారణ నిర్వహించింది అని’ బెంచ్ పేర్కొంది. దర్శన్‌ను నిర్దోషిగా విడుదల చేయడానికి సరైన కారణం లేదు. హైకోర్టు ఉత్తర్వు ఏకపక్షంగా కనిపిస్తోంది. సాక్షుల వాంగ్మూలాలను హైకోర్టు పరిశీలించింది, ఇది ట్రయల్ కోర్టు పని. ఇంత తీవ్రమైన కేసులో, సమస్యలపై పూర్తి దర్యాప్తు లేకుండా బెయిల్ మంజూరు చేయడం తప్పు, అన్యాయం.” తీర్పులో వెల్లడించింది. “విచారణకు కోర్టు మాత్రమే సరైన వేదిక. బలమైన ఆరోపణలు, ఫోరెన్సిక్ ఆధారాలు బెయిల్ రద్దుకు మద్దతు ఇస్తున్నాయి. పిటిషనర్ బెయిల్ రద్దు చేయబడింది” అని ధర్మాసనం పేర్కొంది.
READ MORE: Minister ParthaSarathy: వైసీపీ గెలిస్తేనే.. ప్రజాస్వామ్యాం ఉన్నట్టా..!