Emergency: ప్రముఖ నటి కంగనా రనౌత్ ఇప్పుడు నిర్మాతగానూ మారి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తోంది. మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో ఆమె ‘ఎమర్జెన్సీ’ మూవీని నిర్మిస్తోంది. ఇందులో ఇందిరాగాంధీ పాత్రను స్వయంగా కంగనా రనౌత్ పోషిస్తుండగా, జయప్రకాశ్ నారాయణ గా అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్ పేయిగా శ్రేయస్ తల్పాడ్ నటిస్తున్నారు.
Sagileti Katha: వెండితెరపైకి రాయలసీమ మట్టికథ!
తాజాగా ఈ సినిమాలోకి మరో పాత్ర ప్రవేశించింది. స్వాతంత్ర సమరయోధుడైన బాబూ జగ్జీవన్ రామ్ కాంగ్రెస్ పార్టీలో క్రీయాశీల పాత్ర పోషించడంతో పాటు, రక్షణశాఖ మంత్రిగానూ పనిచేశారు. అయితే ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఆ పార్టీకి రాజీనామా చేసి జనతాపార్టీలో చేరారు. అందరూ అభిమానంగా ‘బాబూజీ’ అని పిలిచే జగ్జీవన్ రామ్ పాత్రను ప్రముఖ దర్శకుడు, నటుడు సతీశ్ కౌశిక్ పోషించబోతున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కంగనా రనౌత్ బుధవారం విడుదల చేసింది.