Kangana Ranaut : ప్రత్యక్ష రాజకీయాలలోకి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్..క్లారిటీ ఇచ్చిన కంగనా తండ్రి అమర్దీప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఎందరో సినీ సెలబ్రిటీలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం సర్వ సాధారణం. ఇప్పటికే తమ సినిమాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చాలా మంది స్టార్ నటి నటులు తమ పొలిటికల్ జర్నీని మొదలుపెట్టారు.చాలామంది నటి నటులు ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు కూడా వెళ్లారు. మరికొందరు వివిధ పార్టీ ల్లో కొనసాగుతూ ప్రజల తరుపున తమ గొంతు వినిపిస్తున్నారు. తాజాగా ఈ గ్లామర్ ప్రపంచంలో నుంచి మరో తార తన రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టేందుకు రెడీ అయింది. ఇంతకీ ఆ భామ ఇంకెవరో కాదు.. బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్. ఈ భామ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్థాయి లో ఇమేజ్ సొంతం చేసుకుంది. సామాజిక సమస్యలపై తనదైన శైలి లో స్పందించే కంగనారనౌత్ నిత్యం ఏదో ఒక కామెంట్స్ తో హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉంటుంది.
అయితే కంగనా రనౌత్ ఫైనల్ గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ విషయమై కంగనా తండ్రి అమర్దీప్ రనౌత్ క్లారిటీ ఇచ్చేశారు.కంగనా రనౌత్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందని అమర్దీప్ స్పష్టం చేశారు. కంగనా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తుందని, ఏ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తుందనేది పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు.. కొన్ని రోజుల క్రితం కంగనా రనౌత్ ద్వారకలోని శ్రీ కృష్ణుడి ఆలయం లో పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెను రాజకీయాల్లోకి వస్తున్నారా..వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా.. అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికీ స్పందిస్తూ ఆ కృష్ణ భగవానుడు ఆశీర్వదిస్తే తప్పక పోటీ చేస్తానంటూ ఆమె చెప్పుకొచ్చింది.అయితే కంగనా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందనేది తెలియాల్సి వుంది.అయితే కంగనారనౌత్ హిమాచల్ ప్రదేశ్ లోని తన సొంత నియోజకవర్గం మండి నుంచి పోటీ చేస్తుందని కొన్ని వార్తలు వస్తున్నాయి.
Also Read
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
Bollywood Superstar #KanganaRanaut is all set to launch her political career by contesting for BJP in 2024 Lok Sabha polls.
Kangana's father, Amardeep Ranaut, thunders #Kangana will contest exclusively on BJP ticket.
BJP High Command will soon decide where she'll contest. pic.twitter.com/WoNq0U7AUj
— Dharma (@Dharma02020) December 20, 2023
తాజావార్తలు
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్‌ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!