బాలీవుడ్ హాట్ బ్యూటీ అయిన కంగనా రనౌత్ గురించి పరిచయం అవసరం లేదు.ఏ విషయాన్ని అయినా కూడా ఆమె కుండలు బద్దలు కొట్టినట్టుగా ముఖం మీద చెప్పేస్తూ ఉంటుందిదీంతో ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తలలో నిలుస్తూ ఉంటుంది కంగనా రనౌత్. మరొకవైపు సినిమా హిట్టు ఫ్లాప్ తో అస్సలు సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నాలుగైదు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీ బిజీగా ఉంది. ఇది ఇలా ఉంటే తరచూ ఏదోక కాంట్రవర్సీతో వార్తలు కంగనా తాజాగా కూడా సంచలన వ్యాఖ్యలు చేసి ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. చాలా మంది A-జాబితా నటీమణులు ఉచితంగా పని చేస్తారని వారు ఇతర మార్గాల్లో దర్శక నిర్మాతలకు ఫేవర్ చేస్తారు అంటూ షాకింగ్ కామెంట్స్ ను చేసింది. ఎంతో గొప్ప మేకర్స్ తో అంది వచ్చిన పాత్రను దక్కించుకోకపోతే తమకు నష్టం జరుగుతుందని,దీంతో అన్ని విధాలా కూడా కమిటవుతారని పారితోషికం లేకుండా ఉచితంగా పని చేస్తారని కూడా కంగన చెప్పుకొచ్చింది.. బాలీవుడ్ లో పారితోషకం వ్యత్సాసం పై కూడా కంగన తీవ్రంగా విరుచుకుపడింది. మగ నటులతో సమానంగా పారితోషకం పొందుతున్న ఏకైక నటి తానేనని కూడా తెలిపింది కంగనా. నేటికీ ఎంతో మంది నటీమణులు ఉచితంగా పనిచేస్తున్నారని, తాను అలా చేయడం లేదని కథానాయకులకు ధీటుగా పారితోషికం అందుకుంటున్న ఏకైక నటిని తాను మాత్రమేనని కంగనా తెలిపింది.అంతేకాకుండా పితృ స్వామ్య నిబంధనలకు అనుగుణంగా గతంలో స్త్రీల ధోరణి ఉండేదని, కానీ సమాన వేతనం కోసం వాదించడంలో నేను మార్గదర్శకురాలిగా మారాను అంటూ తనను తాను ప్రశంసించుకుంది కంగనా రనౌత్. కొన్ని పాత్రల కోసం మేకర్స్ తో చర్చించేప్పుడు తన సమకాలీన నటీమణులు ఉచితంగా పని చేయడానికి కూడా ముందుకొచ్చారని కంగనా తెలిపింది