Kane Williamson: దక్షిణాఫ్రికా T20 లీగ్ (SA20)లో కేన్ విలియమ్సన్ తన అద్భుతమైన ప్రదర్శనతో అరంగేట్రం చేశాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ఈ లీగ్ లో తన ఆరంభ మ్యాచ్‌లోనే తన సత్తా చాటుతూ హాఫ్ సెంచరీతో మెరిశాడు. డర్బన్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌లో ఆడిన తీరు జట్టు భారీ స్కోర్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించింది. శుక్రవారం, జనవరి 10, 2025న జరిగిన మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన డర్బన్ సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఎంచుకుని మంచి ఆరంభం అందుకుంది. ఓపెనర్లు బ్రైస్ పార్సన్స్ (47), బ్రిట్జ్కే (33) తొలి వికెట్‌కి 67 పరుగుల భాగస్వామ్యం సాధించారు. బ్రిట్జ్కే అవుటైన తర్వాత కేన్ విలియమ్సన్ క్రీజ్‌లోకి వచ్చి తన అనుభవాన్ని మొత్తం చూపించాడు.
Also Read: Donald Trump: ట్రంప్‌తో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సమావేశం..
కేన్ విలియమ్సన్ SA20లో తన తొలి మ్యాచ్‌లో 40 బంతుల్లో 60 పరుగులు చేయడంతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. విలియమ్సన్ 150 స్ట్రైక్ రేట్‌తో ఆడటం విశేషం. అతనికి ముల్డర్ (45 నాటౌట్) అద్భుతమైన సహకారం అందించడంతో ఐదో వికెట్‌కు ఈ ఇద్దరు కలిసి 91 పరుగుల భాగస్వామ్యం అందించారు. విలియమ్సన్, ముల్డర్ దెబ్బకు డర్బన్ సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ప్రిటోరియా క్యాపిటల్స్ తరఫున సెనూరన్ ముత్తుసామి మూడు వికెట్లు తీసి రాణించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డర్బన్ సూపర్ జెయింట్స్ కేవలం 2 పరుగులతో విజయం సాధించాయి.
Also Read: Sankranti Effect: సంక్రాంతికి పల్లెబాట పట్టిన ప్రజలు.. టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్!
You’ll want to stick around to the end for this one… 👀
We’ve got another @Betway_za Catch 2 Million WINNER! 💰🎉#BetwaySA20 #DSGvPC #WelcomeToIncredible pic.twitter.com/hDYH4HKYVs— Betway SA20 (@SA20_League) January 10, 2025
ఇకపోతే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలంలో కేన్ విలియమ్సన్ ను కొనడానికి ఏ టీం మ్యానెజ్మెంట్ సభ్యులు రాకపోవడం ఆశ్ఛర్యానికి గురి చేసింది. అలాగే వియాన్ ముల్డర్ కు కూడా వేలంలో ఎవరు ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు వీరిద్దరూ SA20 2025 సీజన్ లో ఆరంభ మ్యాచ్ లోనే తమ ప్రతిభను చాటారు. SA20 లీగ్ దక్షిణాఫ్రికా ప్రేక్షకుల హృదయాల్లో మాత్రమే కాకుండా ప్రపంచ క్రికెట్ అభిమానుల్లో మంచి స్థానం సంపాదించుకుంది. లీగ్ ప్రారంభ మ్యాచ్‌ల నుంచే అభిమానులను ఆకట్టుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది.