NTV Telugu Site icon

Nizamabad: సంచలనం రేపిన ఆరుగురు హత్య కేసును ఛేదించిన కామారెడ్డి పోలీసులు..

Nzb Murder

Nzb Murder

నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన ఆరుగురు హత్య కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు సైకో కిల్లర్ ప్రశాంత్ తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం ఈ కేసుకు సంబధించి కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ వివరాలు వెల్లడించారు. ఒక్కొక్కరినీ ఒక్కో ప్రాంతంలో చంపినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైనట్లు వెల్లడించారు.

Read Also: Tollywood : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని క‌లిసిన సినీ పెద్దలు

15 రోజుల వ్యవధిలోనే కుటుంబంలో ఆరుగురిని హత్య చేసి వివిధ ప్రాంతాల్లో మృతదేహాలు పారేశాడు హంతకుడు. ఈ క్రమంలో సదా శివనగర్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడంతో అసలు విషయం బయటపడిందని ఎస్పీ పేర్కొన్నారు. నవంబర్ 29న ప్రసాద్ ను రాళ్లతో కొట్టి చంపి పూడ్చిపెట్టారని నిందితులను విచారిస్తే తెలిసిందన్నారు. అంతేకాకుండా.. హత్యలు చేయడానికి వాడిన కారు, భూమి పత్రాలు, రూ.30 వేలు నగదు, ఐదు సెల్ ఫోన్లు దొరికినట్లు ఎస్పీ చెప్పారు. ఫోన్లు కూడా మృతులవేనని తెలిపారు. ఆస్తి కోసమే ఈ హత్యలు చేశారు ఎస్పీ పేర్కొన్నారు.

Read Also: Kakani Govardhan Reddy: సీఎం జగన్ నిర్ణయాలతో రైతులకు మేలు జరుగుతుంది..

ఈ ఆరుగురి హత్యల్లో నిందితుడు ప్రశాంత్ తల్లి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పలు అనుమానాల ఆధారంగా ఇది కేవలం ప్రాథమిక విచారణ అని.. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తామని ఎస్పీ సింధు శర్మ తెలిపారు. నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.