kamal Hasan : స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ సౌత్ ఇండస్ట్రీలో పలు భాషల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్లుగా నిలిచాయి. సింగింగ్, యాక్టింగ్, మ్యూజిక్ ఇలా మల్టీ టాలెంటెడ్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె నటనతో పాటు అడపాదడపా పాటలు కూడా పాడుతూ అభిమానులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.
Read Also:Alcohol : మద్యం తాగిన వెంటనే శరీరంలో కలిగే మార్పులు?
తాజాగా శ్రుతి హాసన్ ఓ సినిమా కోసం మరోసారి తన గాత్రాన్ని సవరించింది. ‘ఇలెవెన్’ అనే సినిమాలో శ్రుతి హాసన్ ఓ అద్భుతమైన పాట పాడింది. మ్యూజిక్ డైరెక్టర్ ఇమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఇటీవలే విడుదల చేశారు ఆ చిత్రబృందం. అయితే, దసరా పండుగ కానుకగా ఈ పాటను అక్టోబర్ 11న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. ‘ది డెవిల్ వెయిటింగ్’ అనే ఈ పాటను విశ్వనటుడు కమల్ హాసన్ చేతుల మీదుగా లాంచ్ చేయనున్నారు. అక్టోబర్ 11న మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ పాటను ఆయన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ‘ఇలెవెన్’ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర నటిస్తున్నారు.శృతి హాసన్ సినిమాల విషయానికి వస్తే కూలీ సినిమాలో నటిస్తోంది. అలాగే ప్రభాస్ తో కలిసి సలార్ 2లో నటించాల్సి ఉంది.
Read Also:Congress: హర్యానా ఫలితాలపై కాంగ్రెస్‌లో గుబులు!.. నాయకులపై రాహుల్ గాంధీ సీరియస్