Site icon NTV Telugu

Kalyani Priyadarshan : మలయాళ బ్యూటీకి హిందీ ఛాన్స్..

Kalyani Darshai

Kalyani Darshai

సౌత్ సినిమాల్లో తనదైన నటనతో మెప్పిస్తున్న మలయాళ భామ కల్యాణి ప్రియదర్శన్ ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టింది. గతేడాది విడుదలైన ‘కొత్త లోక: చాప్టర్ 1’ (Lokah Chapter 1) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈమె, ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్‌ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. జై మెహతా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ‘ప్రలే’ (Pralay) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది ఒక వినూత్నమైన ‘జాంబీ యాక్షన్ థ్రిల్లర్’ కావడం విశేషం. ఈ సినిమాతో కల్యాణి హిందీ చిత్రసీమలోకి గ్రాండ్‌గా అడుగుపెట్టబోతుండటంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.

Also Read : Jana Nayagan: థియేటర్లలోకి రాకముందే ఓటీటీ డేట్ ఫిక్స్?

ప్రస్తుతం రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ ఏడాది మార్చి 19న దీని సీక్వెల్ ‘ధురంధర్ 2’ విడుదల కానుంది. ఆ తర్వాతే ‘ప్రలే’ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని రణవీర్ సింగ్ స్వయంగా తన ‘మా కసమ్ ఫిలిమ్స్’ బ్యానర్‌పై నిర్మిస్తుండటం మరో విశేషం. హాలీవుడ్ స్థాయి వాల్యూస్‌తో, ఒక సరికొత్త ప్రపంచాన్ని కళ్లకు కట్టేలా ఈ జాంబీ థ్రిల్లర్‌ను రూపొందిస్తున్నారు. త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. మొత్తానికి బాలీవుడ్ ఎంట్రీ తో కల్యాణి ప్రియదర్శన్ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Exit mobile version