Site icon NTV Telugu

Kalvakuntla Kavitha: గుంట నక్కల మధ్య బందీ అయిన మనిషి కేసీఆర్.. కవిత సంచలన వ్యాఖ్యలు

Kavitha1

Kavitha1

Kalvakuntla Kavitha: గుంట నక్కల తోడేళ్ళ మధ్యలో బందీ అయిన మనిషి కేసీఆర్ అని కల్వకుంట్ల కవిత అన్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో కవిత తన కొత్త పార్టీ పేరు “తెలంగాణ రాష్ట్ర సేన(TRS)”గా ప్రకటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తన జీవితంలో మర్చిపోలేని రోజుగా అభివర్ణించారు. “నేను అమ్మవారి భక్తురాలిని. నాకు సింగరేణి చాలా ఇష్టం. మీకంటే ఆడబిటాలంటే మరింత ఇష్టం. రాష్ట్రంలో అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 20 ఏళ్లుగా తెలంగాణ జాగృతి ఎంతో కీలకంగా పనిచేసింది. బతుకమ్మ పాట వచ్చాక మన సంస్కృతికి ఊపిరి వచ్చింది. ఏమేమి కలలతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ కలలో నిజం కాలేదు. కేసీఆర్ పాలనలో ఆశించిన ఫలితాలు రాలేదు. బానిస సంకెళ్లు తెగుతాయనుకుంటే రైతులకు బేడీలు ఉద్యమకారులకు కేసులు వచ్చాయి. ఆనాడు పాలించిన కుటుంబంలో నేను ఒకదాన్ని. నాడు జరిగిన తప్పులకు క్షమించమని కోరుతున్నా. తెలంగాణ ప్రజలు ప్రాకారం కోసం తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావించింది. రేపటి నుంచి చూస్తారు మా పని ఎలా ఉంటుందో మా పోరాటం ఎలా ఉంటుందో.” అని కవిత అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ గురించి కవిత సంచలన వ్యాఖ్యల చేశారు. ఆ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందన్నారు. అమ్మతనంతో పాలన సాగిస్తే ప్రజల కష్టాలు తెలుస్తాయని.. అనేకమంది తెలంగాణ రాష్ట్ర వచ్చిందన్నారు. నీళ్ల కోసం ఒక లక్ష ఇరవై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టిందని.. 14 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చిందన్నారు. ఆనాటి కేసీఆర్ వేరు.. ఇప్పటి కేసీఆర్ వేరన్నారు. ఇప్పుడు కేసీఆర్ మారిన మనిషి.. మర మనిషి అన్నారు. “ఆ సారు రారు.. గుంట నక్కల తోడేళ్ళ మధ్యలో బందీ అయిన మనిషి కేసీఆర్. కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతున్నారు. కేటీఆర్‌కు ఏమి తెలియదు కాబట్టి మాట్లాడరు అనుకుందాం. కానీ కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు. ఆనాడు టీఆర్ఎస్ కోసం, కేసీఆర్ కోసం కొట్లాడిన వాళ్లకు ఏమి దక్కింది? ఇది మన కేసీఆర్ కాదు.. నేను కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పాను. నన్ను బయటకు పంపి.. పందికొక్కులను పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు మనమే ప్రతిపక్షం అవుతాం. రెండేళ్ల తర్వాత మనమే అధికార పక్షం అవుతాం” అని కవిత వ్యాఖ్యానించారు.

Exit mobile version