Kalvakuntla Kavitha: గుంట నక్కల మధ్య బందీ అయిన మనిషి కేసీఆర్.. కవిత సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalvakuntla Kavitha: గుంట నక్కల తోడేళ్ళ మధ్యలో బందీ అయిన మనిషి కేసీఆర్ అని కల్వకుంట్ల కవిత అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో కవిత తన కొత్త పార్టీ పేరు “తెలంగాణ రాష్ట్ర సేన(TRS)”గా ప్రకటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తన జీవితంలో మర్చిపోలేని రోజుగా అభివర్ణించారు. “నేను అమ్మవారి భక్తురాలిని. నాకు సింగరేణి చాలా ఇష్టం. మీకంటే ఆడబిటాలంటే మరింత ఇష్టం. రాష్ట్రంలో అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 20 ఏళ్లుగా తెలంగాణ జాగృతి ఎంతో కీలకంగా పనిచేసింది. బతుకమ్మ పాట వచ్చాక మన సంస్కృతికి ఊపిరి వచ్చింది. ఏమేమి కలలతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ కలలో నిజం కాలేదు. కేసీఆర్ పాలనలో ఆశించిన ఫలితాలు రాలేదు. బానిస సంకెళ్లు తెగుతాయనుకుంటే రైతులకు బేడీలు ఉద్యమకారులకు కేసులు వచ్చాయి. ఆనాడు పాలించిన కుటుంబంలో నేను ఒకదాన్ని. నాడు జరిగిన తప్పులకు క్షమించమని కోరుతున్నా. తెలంగాణ ప్రజలు ప్రాకారం కోసం తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావించింది. రేపటి నుంచి చూస్తారు మా పని ఎలా ఉంటుందో మా పోరాటం ఎలా ఉంటుందో.” అని కవిత అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ గురించి కవిత సంచలన వ్యాఖ్యల చేశారు. ఆ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందన్నారు. అమ్మతనంతో పాలన సాగిస్తే ప్రజల కష్టాలు తెలుస్తాయని.. అనేకమంది తెలంగాణ రాష్ట్ర వచ్చిందన్నారు. నీళ్ల కోసం ఒక లక్ష ఇరవై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టిందని.. 14 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చిందన్నారు. ఆనాటి కేసీఆర్ వేరు.. ఇప్పటి కేసీఆర్ వేరన్నారు. ఇప్పుడు కేసీఆర్ మారిన మనిషి.. మర మనిషి అన్నారు. “ఆ సారు రారు.. గుంట నక్కల తోడేళ్ళ మధ్యలో బందీ అయిన మనిషి కేసీఆర్. కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతున్నారు. కేటీఆర్‌కు ఏమి తెలియదు కాబట్టి మాట్లాడరు అనుకుందాం. కానీ కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు. ఆనాడు టీఆర్ఎస్ కోసం, కేసీఆర్ కోసం కొట్లాడిన వాళ్లకు ఏమి దక్కింది? ఇది మన కేసీఆర్ కాదు.. నేను కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పాను. నన్ను బయటకు పంపి.. పందికొక్కులను పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు మనమే ప్రతిపక్షం అవుతాం. రెండేళ్ల తర్వాత మనమే అధికార పక్షం అవుతాం” అని కవిత వ్యాఖ్యానించారు.
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి