Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’లో టాలీవుడ్ యువ హీరో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Hero Teja Sajja part of Prabhas’s Kalki 2898 AD Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్వని దత్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా కల్కి 2898 ఏడీ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కల్కి 2898 ఏడీలో టాలీవుడ్ యువ హీరో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అతడు మరెవరో కాదు.. ఇటీవల విడుదలైన ‘హనుమాన్’ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన తేజ సజ్జా. ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీలో తేజ నటిస్తున్నాడట. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో నిర్మాత సి. అశ్వని దత్‌తో తేజ కలిసి కనిపించడం ఈ వార్తకు మరింత బలం చేకూర్చింది. అంతేకాదు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ.. తాను చేయాల్సిన కొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయని, విషయం చెప్పడానికి సరైన క్షణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు.
Also Read
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
Also Read: Ram Charan: రామ్ చరణ్ సరసన మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్!
కల్కి 2898 ఏడీలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ భారీ బడ్జెట్ చిత్రంకు సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రం కథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుంది. గతంతో ప్రారంభమై.. భవిష్యత్తుతో ముగుస్తుంది. తాజాగా ‘జస్ట్ ది వార్మ్ అప్’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!