‘Kalki 2898 AD’ Release Date:కల్కి వాయిదా లేదు.. ఒక్క పోస్టుతో నోళ్లు మూయించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తున్నాడు.. రీసెంట్ గా సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకేక్కిన ఈ సినిమా గత ఏడాది విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.. ప్రస్తుతం లైనప్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ పెట్టాడు. ప్రభాస్ కల్కి సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది.. డబ్బింగ్ పనులను టీమ్ మొదలు పెట్టేసింది.. కానీ సినిమా రిలీజ్ వాయిదా అంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే తాజాగా సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడే అంటూ ఒక్క పోస్టుతో సినిమా క్లారిటి ఇచ్చేసింది..
ఈ సినిమా సరికొత్త కథతో రాబోతుంది.. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెలుగులో రూపొందుతున్న ఫ్యూచరిస్టిక్ మూవీ.. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు.. సమ్మర్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు యూనిట్ రెడీ అవుతుంది.. కాగా, ఈ మూవీ మొత్తం మూడు భాగాలుగా రాబోతుందని, ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యిందని టాక్. ప్రస్తుతం సెకండ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతుందట..
Also Read
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
ఇప్పటివరకు మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమా పై మంచి హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.. దీంతో కల్కీ నుంచి వస్తున్న ఎలాంటి అప్డేట్ అయినా క్షణాల్లో ట్రెండీంగ్కి వచ్చేస్తున్నాయి. అయితే ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ చేయాల్సి ఉండగా వీఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ కారణంగా వాయిదా పడింది. మూవీ రిలీజ్పై రకరకాలు పుకార్లు వినిపిస్తున్న క్రమంలో మే 9న కల్కీ విడుదలను ఫిక్స్ చేస్తూ ఇటీవలె మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. అయితే ఈ ఆఫీషియల్ అనౌన్స్మెంట్పై కూడా పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదని, మూవీ మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది..
ఈ వార్తలకు చెక్ పెడుతూ తాజాగా వైజయంతి మూవీస్ ఓ ప్రకటన వదిలింది. ఈ సందర్భంగా ప్రభాస్కు సంబంధించిన గ్లింప్స్ వదిలి రూమర్స్కు చెక్ పెట్టింది. కల్కీ మే 9న ఆగయా అంటూ ఒక్క పోస్ట్తో మూవీ వాయిదాపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అంటే కల్కీ మే 9న రావడం పక్కా అని ఆ రోజు థియేటర్లో టా టక్కరా టక్కరే అంటూ ఆడియన్స్లో మరింత జోష్ నింపింది టీమ్..ఈ సినిమాను రూ. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు రాజమౌళి, రానా, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని, మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నారు..సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ను అందిస్తున్నారు..
తాజావార్తలు
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!