Kalki 2898 AD: నార్త్ అమెరికాలో వసూళ్ల సునామి సృష్టించిన “కల్కి”..
- నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ మొదటిరోజు రూ.191.5 కోట్లు భారీ వసూలు.
- నార్త్ అమెరికాలో ఆల్ టైం భారీ వసూళ్లతో దూసుకుపోతుంది.
- 7 మిలియన్ డాలర్లకి పైగా వసూళ్లు.
- వీకెండ్ కావడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD: తాజాగా బాక్సాఫీస్ వద్ద విడుదలైన ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ మొదటిరోజు రూ.191.5 కోట్లు భారీ వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో రూ.100 కోట్ల రికార్డును సాధించిన 11వ చిత్రంగా కల్కి నిలిచింది. ఇక ఇందులో ప్రభాస్ నటించిన 5వ సినిమా కావడం విశేషం. మొదటి రోజు రూ.100 కోట్లు పైన వసూలు చేసిన చిత్రాల జాబితాలో రూ.223 కోట్ల గ్రాస్ తో వసూలు మొదటి స్థానంలో ‘RRR’ ఉండగా.. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ రూ.217 కోట్లు వసూలు చేసి రెండో స్థానంలో ఉంది. ఇక ఇప్పుడు మూడో స్థానంలో ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు వసూలు చేసి మూడో స్థానంలోకి వచ్చింది.
Top Headlines @9AM : టాప్ న్యూస్
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
తొలి షో నుండే ప్రపంచవ్యాప్తంగా సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్ల వద్ద సినిమా చూడ్డానికి భారీగా వస్తున్నారు. ఇక ఈ చిత్రం నార్త్ అమెరికాలో ఆల్ టైం భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఇప్పటి వరకూ అక్కడ 7 మిలియన్ డాలర్లకి పైగా వసూళ్లు రాబట్టంది. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడిందించారు చిత్ర బృందం సభ్యులు. వీకెండ్ కావడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ , దీపికా పదుకునే, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, శోభన, మాళవిక నాయర్ లాంటి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందించారు.
Suhana Khan – Agastya Nanda : లండన్ లో అమితాబ్ మనవడుతో షారుక్ కుమార్తె హల్చల్..
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!