నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభం కానున్నది. ఈరోజు ఉదయం 11:30 గంటలకు కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి ఈటల రాజేందర్ హాజరుకానున్నారు. కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఈటెలను క్రాస్ ఎగ్జామింగ్ చేయనున్నారు. గతంలో ఈటెల నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా ప్రశ్నావళి సిద్దం చేసింది కమిషన్. మొదటి గంట కమిషన్ ముందు వివరాలు వెల్లడించేందుకు అవకాశం ఇవ్వనున్నారు జస్టిస్ చంద్ర ఘోష్. కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్థికపరమైన ప్రశ్నలు కమిషన్ అడుగనున్నది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 11వ తేదీన హాజరు కానున్నట్లు తెలిపారు.
Also Read:Delhi: ఢిల్లీలో ఎద్దు బీభత్సం.. నిలిచి ఉన్న వ్యక్తిపై దాడి.. వీడియో వైరల్
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై విచారణకు కమిషన్ వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపుగా తుది దశకు చేరుకుంది. అయితే, ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే.
