NTV Telugu Site icon

Kaleshwaram Commission : కాళేశ్వరం కమిషన్‌ విచారణలో హరీష్‌రావు పేరు..

Kaleshwaram Kamission

Kaleshwaram Kamission

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జరుగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. శనివారం, సీఈ సుధాకర్ రెడ్డి కమిషన్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల టెండర్లపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా, సుధాకర్ రెడ్డి తనిఖీలు లేకుండా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి సబ్ స్టాన్షియల్ పత్రం ఇచ్చినట్లు అంగీకరించారు. డీపీఆర్ ప్రకారం కాఫర్ డ్యామ్‌కు డబ్బులు కేటాయించినట్లు వివరించారు. మేడిగడ్డ డిజైన్ ఖరారు చేసే సమయంలో ఎల్ అండ్ టీని సంప్రదించినట్లు చెప్పారు. మాజీ మంత్రి హరీష్‌ రావు పేరు ఈ విచారణలో మూడు సార్లు ప్రస్తావనకు వచ్చింది. అప్పటి ఇరిగేషన్ మంత్రి ఎవరు అని ప్రశ్నించగా, హరీశ్ రావు అని సుధాకర్ సమాధానం ఇచ్చారు.

AAP: మహారాష్ట్ర ఎన్నికలకు దూరంగా ఆప్.. మిత్రపక్షాల కోసం ప్రచారం..

హరీశ్ రావు మంత్రిగా ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు టెండర్ల ప్రాసెస్ జరిగింది అన్నది సుధాకర్ స్పష్టం చేశారు, కానీ టెండరింగ్ ప్రాసెస్ జరగలేదని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఫైనల్ బిల్లులు ఆలస్యమవ్వడానికి కారణాలు ఏమిటని కమిషన్ ప్రశ్నించగా, సుధాకర్ రెడ్డి అర్థం చేసుకోనట్లుగా సమాధానం ఇచ్చారు. అన్నారం, సుందిళ్ల ఫైనల్ బిల్లులను నిర్మాణ సంస్థలు సమర్పించాయని, కానీ మేడిగడ్డ పైనల్ బిల్లులు ఇంకా అందలేదు అన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కు ఎలాంటి ఆదాయం లేదని సుధాకర్ తెలిపారు, వరద వేగాన్ని అంచనా వేయకపోవడం వల్లే బ్లాకులు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌసుకు క్యూ కట్టిన సెలబ్రిటీలు.. ఎవరెవరు వెళ్లారంటే?