Site icon NTV Telugu

Kaleru Venkatesh : ప్రచారంలో దూసుకుపోతున్న కాలేరు వెంకటేష్

Kaleru Venkatesh

Kaleru Venkatesh

వచ్చే ఎన్నికల్లో రెండోసారి అంబర్పేట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ కు కానుకగా ఇస్తానని అంబర్పేట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ అన్నారు. ముఖ్యమంత్రి గా కేసీఆర్ మూడో సారి గెలుపు ఖాయమని కాచిగూడ డివిజన్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి చెప్పాల్ బజార్, పలు బస్తీలలో ఇంటింటికి తిరుగుతూ కాచిగూడ ఓటర్లను కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. మన కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలే ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని మీరు మళ్లీ అంబర్‌పేట్ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కోరారు.

Also Read :Shakeela: నా కన్నతల్లే.. నన్ను వాళ్ల దగ్గర పడుకోబెట్టింది

మేనిఫెస్టోలో ఉంచిన అన్ని హామీలను నెరవేరుస్తామని, మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్ద పీట వేశారు.. అదే అంశాన్ని ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తూ మహిళలకు వివరించడం జరిగింది. ఈ ప్రచారంలో మహిళల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది.. మహిళల నుంచి వస్తున్న స్పందన ద్వారా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయం తప్పకుండా సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్.

Also Read : Bombay High Court: బిడ్డను కిడ్నాప్ చేశాడని కన్నతండ్రిపై కేసు పెట్టలేం..

Exit mobile version