Shakeela: శృంగార తార షకీలా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకానొక సమయంలో ఆమె సినిమాల కోసమే ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లేవారంటే అతిశయోక్తి లేదు. ఇక షకీలాకు సంబంధించిన బయోపిక్ కూడా తెరమీదకు వచ్చింది. ఈ మధ్యనే బిగ్ బాస్ తెలుగు లో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఇక అక్కడ .. తన జీవితం గురించి చెప్తూ.. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. కానీ, తన వయస్సు ఎక్కువ కావడంతో గేమ్స్ ఆడలేకపోవడంతో .. నామినేషన్స్ ఎక్కువగా రావడంతో ఆమెను బిగ్ బాస్ ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చాకా షకీలా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఎన్నో ఇంటర్వ్యూలో ఆమె డబ్బు కోసం .. తాను అలాంటి సినిమాల్లో నటించాను అని, నటనను కాకుండా తన శరీరాన్ని మాత్రమే ఎక్కువ చూసేవారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన కన్నతల్లే తనను ఈ నరకకూపంలోకి నెట్టిందని చెప్పుకొచ్చింది.
Lavanya Tripathi: మెగా కోడలి పెళ్లి చీర.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ?
” చిన్నతనం నుంచి మా ఇంట్లో డబ్బు సమస్యలు ఉండేవి. చిన్నప్పుడే నేను సినిమాల్లోకి వచ్చాను. నా శరీరం చిన్నప్పటి నుంచి పెద్దదిగానే ఉండేది. స్కూల్ చదివేటప్పుడే కాలేజ్ వయస్సు ఉన్న అమ్మాయిలా కనిపించేదాన్ని. రోడ్డు మీద వెళ్తుంటే.. అందరు నన్ను తినేసేలా చూసేవారు. ఇక నా అందం చూసి.. మా అమ్మ నన్నే డబ్బు సంపాదించే సాధనంగా చూసింది. చాలామంది మగవాళ్ళను పరిచయం చేసి.. వారి గదికి తీసుకెళ్లి పడుకోబెట్టింది. అందుకు నేను ఒప్పుకొనేదాన్ని కాదు. అందుకు ఆమె నన్ను తీవ్రంగా కొట్టేది. వేరే మార్గం లేక ఆమె చెప్పినట్లు చేసేదాన్ని. అలా అలవాటు అయ్యి.. సినిమాలోకి వచ్చాను. ఇక్కడ కూడా నా శరీరాన్ని చూసేవారే కానీ, నా నటనను ఎవరు చూడలేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.