Kakinada Collector: కాకినాడ కలెక్టర్ షన్మోహన్ కంట తడి పెట్టుకున్నారు. బాలల హక్కుల వారోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలపై మాట్లాడుతూ కలెక్టర్ షన్మోహన్ ఎమోషనల్ అయ్యారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించడం వల్లే కలెక్టర్ అయ్యానని భావోద్వేగానికి గురయ్యారు. కాకినాడలో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌ను ఉద్దేశించి కలెక్టర్ వ్యాఖ్యానించారు. బాలలను లైంగికంగా వేధించే వారిని మరొక దేశంలో ఉరి వేస్తారని.. పోక్సో కింద కేసు నమోదు అయిన టీచర్‌ను తాను కొట్టలేను కనుక కొట్టలేదన్నారు. ఆఫీసర్‌ని పెట్టి అక్కడే ఉరి వేయాలన్నారు. ఆ టీచర్ ఇంట్లో కూడా అదే వయస్సు పిల్లలు ఉన్నారు..ఆయనకు అదేం ఖర్మ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Anil Kumar Yadav: పార్టీ మారుతున్నారనే వార్తలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ క్లారిటీ!
అలాంటి కీచక టీచర్లను ఫ్యామిలీలో తలెత్తుకోకుండా చేయాలన్నారు. కీచక టీచర్లు అని తెలిసి మిగిలిన టీచర్లు మనకెందుకులే అని వదిలేస్తున్నారన్నారు. అలా చేస్తే వారు చదువు చెప్పే పిల్లల జీవితాలను చేతులారా నాశనం చేసుకున్నవాళ్ళవుతారని అన్నారు. ఏ టీచరైనా విద్యార్ధులను లైంగికంగా వేధిస్తే ఫోక్సోతో పాటుగా వేరే కేసు పెట్టి లోపలేయిస్తానని హెచ్చరించారు. బదిలీల సమయంలో కొందరు టీచర్లు వారి ఇంటి నుండి 10 కి.మీ దూరంలో ఉన్న స్కూల్ కోసం ఎమ్మెల్యే, ఎంపీ సిఫార్స్ లేఖలు తీసుకుని వస్తున్నారని.. నాకు సిగ్గుగా అనిపిస్తుందన్నారు. విద్యార్థులను అలాంటి టీచర్లు మోసం చేసినట్లేనని కలెక్టర్ వ్యాఖ్యానించారు.