Kakarla Suresh: టీడీపీ ప్రభుత్వంలోనే అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరిశ్రమలు రావాలంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. కలిగిరి మండల కేంద్రంలో కాకర్ల సురేష్, మండల కన్వీనర్ బిజ్జం వెంకట కృష్ణారెడ్డి, వరికుంటపాడు మండలానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకులు, ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన సుంకర అంజనాద్రి, వెంకటాద్రిల ఆధ్వర్యంలో కలిగిరి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు.. సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగాలు కావాలంటే బాబు రావాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తాత్కాలికమేనని, భవిష్యత్తుకు ఉపయోగ పడవు అన్నారు. రాష్ట్రం బాగుపడాలన్న పేద బడుగు బలహీన వర్గాలు స్థిరంగా ఉండాలన్న వారి జీవితాలలో వెలుగులు నిండాలన్న విజన్ ఉన్న నాయకుడు ప్రణాళిక బద్ధంగా ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు కావలసిన ప్రణాళిక చంద్రబాబు వద్ద ఉందన్నారు. తొమ్మిది పర్యాయాలు పోటీ చేసి 16 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన అనుభవము ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు కావాలన్నారు.
Also Read
- Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
Elvish Yadav: మళ్ళీ చిక్కుల్లో బిగ్ బాస్ విన్నర్.. కేసు నమోదు
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే సంక్షేమ అభివృద్ధి పథకాలు రూపకల్పన చేశారు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వాటి విలువ పెంచుకుంటూ పోయారే తప్ప వీరు కొత్తగా చేసింది ఏమీ లేదన్నారు. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా ఎదిగారంటే అది చంద్రబాబు నాయుడు వల్లేనన్నారు. చదువుకున్న అక్క చెల్లెమ్మల కోసం కలలకు రెక్కలు డాట్ కామ్ ద్వారా ఆన్లైన్ చేసుకుంటే వారికి ఉపాధి కల్పించడంతోపాటు, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్థిక స్వాతంత్రం తీసుకొస్తామన్నారు. గత రెండు సంవత్సరాలుగా కాకర్ల ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశానన్నారు. అధికారం ఉంటే మరెన్నో చేసేందుకు వీలుగా ఉంటుందన్నారు. రాజకీయాలలో కొత్త వరవడి సృష్టిస్తానని తెలిపారు.
రాజకీయాల్లోకి వచ్చేది దోచుకోవడం దాచుకోవడం కోసం కాదని సేవ చేసేందుకేనని రుజువు చేస్తానన్నారు. కనుక అందరూ నన్ను ఆదరించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. అదేవిధంగా నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవా తత్వరుడు అని జిల్లాలో 160 గ్రామాల్లో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఫ్లోరిన్ బారి నుండి కాపాడిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అటువంటి వారిని ఎంపీగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కనుక ఆయనకు కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. ముందుగా కలిగిరి పట్టణంలో వేంచేసి ఉన్న మాలక్ష్మమ్మ ఆలయంలో కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలిగిరి పట్టణంలోని అభిమానులు నాయకులు కాకర్ల సురేష్ గారిని శాలువాపూలమాలలతో ఘనంగా సన్మానించారు. కలిగిరి ప్రజానీకం అడుగడుగునా కాకర్ల సురేష్ కు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో కలిగిరి మండలంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు, జనసైనికులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!