Kakani Govardhan Reddy: చంద్రబాబువి అన్నీ శంకుస్థాపనలే.. వేటికీ ప్రారంభోత్సవాలు చేయలేదని ఆరోపించారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాలుగేళ్లలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నో ఆదర్శవంతమైన పథకాలు తీసుకువచ్చారు.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశారని తెలిపారు.. దళారులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే అందించారు.. నామినేటెడ్ పదవుల్లో అన్ని వర్గాలకూ ప్రాధాన్యం ఇచ్చారు.. కరోనాతో పాటు ఎన్నో విపత్కర పతిస్థితులు వచ్చినా ఇచ్చిన హామీలను అమలు చేశారంటూ ప్రశంసలు కురిపించారు.
Read Also: GVL Narasimha Rao: ప్రపంచ దేశాల నేతలకు బాస్‌లా మారిన మోడీ.. ఐదో బలమైన దేశంగా భారత్
మహానాడు పేరుతో చంద్రబాబు ఆడిన డ్రామాలను ప్రజలు చూశారని ఎద్దేవా చేశారు కాకాణి.. ఎన్నికలప్పుడు ఎన్టీఆర్‌ను గుర్తుకు తెచ్చుకుంటారు.. మహానాడులో మాత్రమే ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని అడుగుతారు.. మరి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నపుడు ఎందుకు గుర్తుకు రాలేదు? చంద్రబాబుకు చిత్ర శుద్ధి లేదు అని మండిపడ్డారు.. ఇక, టీడీపీ మొదటి మేనిఫెస్టో విడుదల చేశారు.. ఇంకా ఎన్ని వస్తాయో చూడాలన్న ఆయన.. 2014లో ఇచ్చిన హామీలు గుర్తుకు రాలేదు.. అప్పుడు మేనిఫెస్టోలో 650 వాగ్దానాలు ఇచ్చి.. 10 శాతం కూడా చంద్రబాబు అమలు చేయలేదు అని ఆరోపించారు.. చంద్రబాబువి అన్నీ శంకుస్థాపనలే.. వేటికీ ప్రారంభోత్సవాలు చేయలేదని ఆరోపించారు.. కృష్ణపట్నం, రామయ్య పోర్టులకు కేవలం శంకుస్థాపనే చేశారు.. కానీ సీఎం జగన్ అన్నింటినీ పూర్తి చేసి ప్రారంభిస్తున్నారని తెలిపారు. అసలు, చంద్రబాబు పేరు చెబితే ఏ పథక మైనా గుర్తుకు వస్తుందా..? అని ప్రశ్నించారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.
