Bhagavanth Kesari: హనుమకొండలో బతుకమ్మ ఆడిన కాజల్ అగర్వాల్, శ్రీలీల.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kajal Aggarwal and Sreeleela played Bathukamma at Hanamkonda: తెలంగాణలో ‘బతుకమ్మ’ పండగ ఈ నెల 15న (మహాలయ అమావాస్య) ఆరంభం కానుంది. ఆడపడుచులంతా కలిసి చేసుకునే పూల పండగ బతుకమ్మ.. అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు సందడిగా కొనసాగుతుంది. అయితే బతుకమ్మ సందడి ఈసారి ముందే ప్రారంభమైంది. ఆదివారం హనుమకొండలో హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, శ్రీలీల బతుకమ్మ ఆడారు. భగవంత్ కేసరి ట్రైలర్ విడుదల కార్యక్రమంలో భాగంగా ఈ ఇద్దరు బతుకమ్మ ఆడిపాడారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన సినిమా ‘భగవంత్ కేసరి’. యువ హీరోయిన్ శ్రీలీల ముఖ్యభూమిక పోషించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా నటించారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా భగవంత్ కేసరి ట్రైలర్ విడుదల కార్యక్రమం గత రాత్రి హనుమకొండలో జరిగింది.
Also Read
Also Read: Yatra 2: ‘యాత్ర 2’ నుంచి ఫస్ట్ లుక్ విడుదల.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని..!
భగవంత్ కేసరి ట్రైలర్ విడుదల కార్యక్రమంలో హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు. ఇద్దరు తెలుగు అమ్మాయిలా మెరిసిపోయారు. ట్రైలర్ విడుదల కార్యక్రమం సందర్భంగా శ్రీలీల, కాజల్ బతుకమ్మ ఎత్తుకుని స్టేజ్‌పై వెళ్లారు. అక్కడ పెట్టి బతుకమ్మ ఆడిపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#Kajal and #Sreeleela playing Bathukamma #BhagavanthKesariOnOCT19 pic.twitter.com/lebZjFn9rj
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) October 8, 2023
తాజావార్తలు
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!