NTV Telugu Site icon

Attack On Singer: పాట పాడాలని ప్రముఖ సింగర్ పైకి వాటర్ బాటిళ్లు విసిరిన ఫ్యాన్స్

Singer Kailash

Singer Kailash

Attack On Singer: ప్రముఖ సింగర్ కైలాశ్ ఖేర్ కు కర్ణాటకలో చేదు అనుభవం ఎదురైంది. హంపీ ఉత్సవాల్లో భాగంగా జరిగిన సంగీత విభావరిలో గాయకుడు కైలాశ్‌ ఖేర్‌ పాల్గొన్నారు. కన్నడ భాషలో పాటలు పాడాలని డిమాండ్‌ చేస్తూ ఇద్దరు యువకులు వాటర్‌ బాటిల్స్‌ విసిరారు. ఈ ఘటనతో అక్కడ ఉన్న వారందరూ షాక్‌ అయ్యారు. అయితే అది అతనికి తాకనప్పటికీ.. సమీపంలో వచ్చిపడింది. ఇదేదీ పట్టించుకోకుండా ఖేర్‌ తన ప్రదర్శనను కొనసాగించారు. అక్కడే ఉన్న అధికారులు క్షణాల్లోనే ఆ బాటిల్‌ను స్టేజ్‌పై నుంచి తొలగించారు. అయితే కైలాశ్‌ ఖేర్‌ పూర్తిగా హిందీ పాటలే పడుతుండటంతో కన్నడ సాంగ్స్‌ పాడలేదన్న ఆగ్రహంతో యువకులు దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు. బాటిల్‌ విసిరిన వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కార్యక్రమం యథావిధిగా కొనసాగిందని వెల్లడించారు.

Read Also: Love Jihad: లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా ముంబైలో భారీ ప్రదర్శన

హిందీతోపాటు దక్షిణాది చిత్రాల్లోనూ సింగర్‌ కైలాశ్‌ ఖేర్‌ పాటలు పాడారు. కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా ‘హంపీ ఉత్సవాలు’ వేడుకగా జరిగాయి. జనవరి 27 నుంచి 29 వరకు జరిగిన ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో గాయకుడు కైలాశ్‌ ఖేర్‌ పాల్గొని హిందీ పాటలు ఆలపించారు. ‘పరుగు’, ‘మిర్చి’, ‘భరత్‌ అనే నేను’ వంటి తెలుగు చిత్రాల్లో కైలాశ్‌ పాటలు ఆలపించారు. ‘బాహుబలి’ హిందీ, తమిళ వెర్షన్స్‌లో ఆయన పాటలు పాడారు.