Attack On Singer: పాట పాడాలని ప్రముఖ సింగర్ పైకి వాటర్ బాటిళ్లు విసిరిన ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Attack On Singer: ప్రముఖ సింగర్ కైలాశ్ ఖేర్ కు కర్ణాటకలో చేదు అనుభవం ఎదురైంది. హంపీ ఉత్సవాల్లో భాగంగా జరిగిన సంగీత విభావరిలో గాయకుడు కైలాశ్ ఖేర్ పాల్గొన్నారు. కన్నడ భాషలో పాటలు పాడాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు యువకులు వాటర్ బాటిల్స్ విసిరారు. ఈ ఘటనతో అక్కడ ఉన్న వారందరూ షాక్ అయ్యారు. అయితే అది అతనికి తాకనప్పటికీ.. సమీపంలో వచ్చిపడింది. ఇదేదీ పట్టించుకోకుండా ఖేర్ తన ప్రదర్శనను కొనసాగించారు. అక్కడే ఉన్న అధికారులు క్షణాల్లోనే ఆ బాటిల్‌ను స్టేజ్‌పై నుంచి తొలగించారు. అయితే కైలాశ్ ఖేర్ పూర్తిగా హిందీ పాటలే పడుతుండటంతో కన్నడ సాంగ్స్ పాడలేదన్న ఆగ్రహంతో యువకులు దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు. బాటిల్ విసిరిన వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కార్యక్రమం యథావిధిగా కొనసాగిందని వెల్లడించారు.
Read Also: Love Jihad: లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా ముంబైలో భారీ ప్రదర్శన
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
హిందీతోపాటు దక్షిణాది చిత్రాల్లోనూ సింగర్ కైలాశ్ ఖేర్ పాటలు పాడారు. కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా ‘హంపీ ఉత్సవాలు’ వేడుకగా జరిగాయి. జనవరి 27 నుంచి 29 వరకు జరిగిన ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో గాయకుడు కైలాశ్ ఖేర్ పాల్గొని హిందీ పాటలు ఆలపించారు. ‘పరుగు’, ‘మిర్చి’, ‘భరత్ అనే నేను’ వంటి తెలుగు చిత్రాల్లో కైలాశ్ పాటలు ఆలపించారు. ‘బాహుబలి’ హిందీ, తమిళ వెర్షన్స్‌లో ఆయన పాటలు పాడారు.
Two people have been arrested for throwing bottles on Kailash Kher during #HampiUtsav2023. They were allegedly angry as the artist was not playing #Kannada songs. #Karnataka #Vijayanagar pic.twitter.com/rrj9xsY9bv
— Imran Khan (@KeypadGuerilla) January 30, 2023
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!