NTV Telugu Site icon

Kadiyam Srihari : లొట్టపీసు కేసు అయితే.. సుప్రీంకోర్టు నీ పిటిషన్ ఎందుకు తిరస్కరించింది…

Kadiyam Srihari

Kadiyam Srihari

Kadiyam Srihari : జనగామ జిల్లా యశ్వంతపూర్ శివారులోని శ్రీ సత్య సాయి కన్వెన్షన్ హాల్‌లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. 10 సంవత్సరాల అధికార కాలంలో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు ఆస్తులు సంపాదించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఓర్వలేక పోతుందన్నారు కడియం శ్రీహరి. కల్వకుంట్ల కుటుంబంలో ఒకరు లిక్కర్ కేసులో తీహార్ జైలుకు వెళ్లారని, రేపో మాపో కేటీఆర్ కూడా జైలుకే అని అన్నారు.

Rinku singh: పెళ్లికి రెడీ అయిన యంగ్ క్రికెటర్.. ఎంపీతో రింకూ సింగ్ ఎంగేజ్మెంట్?

కేటీఆర్‌ లొట్ట పీసు కేసు అని అంటున్నారని, లొట్ట పీస్ కేస్ అయితే కేటీఆర్ ని ఈడీ, ఏసీబీ ఎందుకు ఎంక్వయిరీ కి పిలుస్తుందని, సుప్రీంకోర్టుని పిటిషన్ ఎందుకు తిరస్కరించిందని ఆయన ప్రశ్నించారు. 40 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం దుర్వినియోగం జరిగినట్టు ఆధారాలు ఉన్నాయని, కార్ రేస్ కేసులో కేటీఆర్ ఇచ్చి పుచ్చుకునే విధంగా వ్యవహరించారన్నారు. బాండ్ల రూపంలో నీకు 40 కోట్ల రూపాయలు తిరిగి వచ్చాయని, ఇంత జరిగినా కేటీఆర్ అహంకారంగా వ్యవహరిస్తున్నారన్నారు. కల్వకుంట్ల కుటుంబమే జైలు పాలై తెలంగాణ పరువు తీస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

Amazon Republic Day sale 2025: టూవీలర్స్ పై ఆఫర్ల వర్షం.. ఇప్పుడు కొంటే వేల్లో లాభం!