Kadiyam Srihari : జనగామ జిల్లా యశ్వంతపూర్ శివారులోని శ్రీ సత్య సాయి కన్వెన్షన్ హాల్‌లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. 10 సంవత్సరాల అధికార కాలంలో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు ఆస్తులు సంపాదించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో…