RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RTC Bus Stolen: అన్నమయ్య జిల్లాలో ఓ విచిత్ర దొంగతనం కలకలం రేపింది. కదిరి ఆర్టీసీ డిపోలో నిలిపి ఉంచిన AP39 UX 7686 నంబర్ గల ఆర్టీసీ బస్సును శివశంకర్ అనే వ్యక్తి దొంగిలించి పరారయ్యాడు. ఆశ్చర్యకరంగా తన పెంపుడు కుక్కను కూడా బస్సులో ఎక్కించుకుని కదిరి నుంచి మదనపల్లె వైపు బస్సును నడుపుకుంటూ వెళ్లాడు. అయితే, మార్గమధ్యంలో శివశంకర్ బస్సును నిర్లక్ష్యంగా నడిపినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల ఇతర వాహనాలు, రోడ్డు పక్కన ఉన్న నిర్మాణాలను ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదాల కారణంగా బస్సు ముందు అద్దాలు పగిలిపోగా, ఒకవైపు భాగం కూడా దెబ్బతింది.
అనంతరం మదనపల్లె జాతీయ రహదారిలోని తట్టివారిపల్లె బ్రిడ్జ్ వద్ద బస్సును రోడ్డుపైనే వదిలేసి అక్కడే ఉన్నాడు. స్థానికులు బస్సును గుర్తించి ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని శివశంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, బస్సును ఎందుకు దొంగిలించాడని పోలీసులు ప్రశ్నించగా, శివశంకర్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, బస్సు చోరీ వెనుక అసలు కారణాలను వెలికితీసే పనిలో ఉన్నారు. మొత్తంగా.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారైన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది..
Also Read
- Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
- Karnataka: కన్న కూతురుపై తండ్రి పగ.. కాలేజీకెళ్లి కత్తి దాడి.. దేనికోసమో తెలిస్తే..!
- Bihar Crime: బట్టలూడదీసి.. నగ్నంగా...! భర్తను లవర్‌తో కలిసి కడతేర్చిన భార్య ఎపిసోడ్లో ట్విస్ట్
- Bihar: భోజనం ఆలస్యమైందని.. వదిన తల నరికి, ఇంటి ముందు వేలాడదీసిన వ్యక్తి..
తాజావార్తలు
-
RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Trump Immigration: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికా నుంచి ఇప్పటి వరకు ఎంత మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారంటే!
-
NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
-
Jana Nayagan: కావేరీ నీటిపై మళ్లీ ఉద్రిక్తత.. విజయ్ ‘జన నాయగన్’ స్క్రీనింగ్‌ను అడ్డుకున్న కార్యకర్తలు!
-
Dharmakshetra: టాలీవుడ్లో సరికొత్త చరిత్ర: 30 రోజుల్లోనే భారతదేశపు తొలి ఏఐ ఇండిపెండెంట్ మూవీ “ధర్మక్షేత్ర” ముస్తాబు!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!