Kadapa SP Siddharth Kaushal: జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద, కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే దారుల వెంట సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. జూన్ 4వ తేదీ నుంచి కఠినమైన కర్ఫ్యూ అమలు చేస్తామన్నారు. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also: Eluru Crime: యువతిని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమోన్మాది మృతి!
కౌంటింగ్ కేంద్రాల వద్ద, కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే దారుల వెంట సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి వ్యక్తి కదలికలు సీసీ కెమెరాలు రికార్డు చేస్తాయన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లు అనుమతించబడవని, అలా కాదని నిబంధనలు ఉల్లంఘించి సెల్ ఫోన్లు తీసుకువెళితే సీజ్ చేయడం జరుగుతుందని, మళ్ళీ ఇవ్వబడదన్నారు. జూన్ 4 నుంచి కఠినమైన కర్ఫ్యూ అమలు చేయబడుతుందని, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉంటే తప్ప ఎవరూ ఇళ్ల నుండి బయటకు రాకూడదన్నారు. జూన్ 6వ తేదీ వరకూ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, 30 పోలీసు యాక్ట్ అమలులో ఉంటాయన్నారు. ఎవరైనా బయటి వ్యక్తులకు, గుర్తు తెలియని వ్యక్తులకు, పాత నేరస్థులకు ఆశ్రయమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జూన్ 6వ తేదీ వరకూ నిబంధనలు అమలులో ఉంటాయి, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ కోరారు.