ప్రజల ఐదేళ్ల కష్టాలకు రేపటితో అడ్డుకట్ట పడనుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.
జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద, కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే దారుల వెంట సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.