కృష్ణా జిల్లాలో పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మచిలీపట్నం పార్లమెంటు, 7 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు 14 చొప్పున కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు.
జూన్ 4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కడప నగరంలో ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ వెల్లడించారు. నగర శివార్ల నుంచి బస్సులు, ఇతర వాహనాల దారి మల్లింపులు ఉంటాయన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో కౌంటింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
తెలంగాణ లోక్‌సభ ఓట్ల లెక్కింపు కోసం 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. 17 నియోజక వర్గాలలో ఒక్కో పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేకంగా హాల్ ఏర్పాటు చేశామని.. మల్కాజ్‌గిరిలో అదనపు హాల్ ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.
జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద, కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే దారుల వెంట సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.
వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరితగిన ప్రకటించేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు ప్�