జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద, కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే దారుల వెంట సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన వారిపై కడప పోలీసులు ఉక్కు పాదం మోపారు. ఎన్నికల సందర్భంగా నేరాలకు పాల్పడ్డ 40 మందిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల్లో ఉన్న వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.