Kabzaa 2: కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం కబ్జా. ఆర్. చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచింది. కథ మొత్తం కెజిఎఫ్ ను తలపించేలా ఉండడంతో దానికి కాపీ అంటూ ప్రేక్షకులు ఈ సినిమాను లైట్ తీసుకున్నారు. కన్నడలో సైతం వారం రోజులు తప్ప ఎక్కువ రోజులు థియేటర్ లో ఆడలేదని టాక్. ఇక నేడే ఈ సినిమా ఓటిటీలో అడుగుపెట్టింది. థియేటర్ లో చుడనివారు కనీసం ఓటిటీలోనైనా చూసి.. ఇక్కడైనా హిట్ ను అందిస్తారేమో అని మేకర్స్ ఎదురుచూస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. రిలీజ్ అయ్యి కనీసం నెల కూడా కాకముందే ఓటిటీ లో రిలీజ్ చేసి షాక్ ఇచ్చిన మేకర్స్ .. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించి మరింత షాక్ ఇచ్చారు.
Star Heroes: ఈ స్టార్ హీరోలు నటించిన మొదటి చిత్రం ఏంటో తెలుసా..?
డైరెక్టర్ ఆర్. చంద్రు.. కబ్జా 2 ను ప్రకటించాడు. వార్ మొదలయ్యింది అంటూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశాడు. ఒక కుర్చీ దాని పక్కన గన్ తో పోస్టర్ ఆసక్తికరంగా కనిపిస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తామని తెలిపారు. కబ్జా2 లో ఎవరెవరు ఉంటారు..? ఇంకెవరైనాయాడ్ అవుతారా అనేది తెలియాల్సి ఉంది. ఇక కబ్జాలో ఉపేంద్ర సరసన శ్రీయ నటించింది. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈరోజే కదా పార్ట్ 1 ఓటిటీలోకి వచ్చింది .. అప్పుడే పార్ట్ 2 ఏంటయ్యా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సీక్వెల్ తో చంద్రు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.