Shefali Jariwala: ‘కాంటా లగా’ ఫేమ్ షఫాలీ జరివాలా మృతి!
- కాంటా లగా ఫేమ్ షఫాలీ జరివాలా మృతి
- గుండె పోటుతో షఫాలీ జరివాలా మృతి
- 2002లో విడుదలైన ఐకానిక్ మ్యూజిక్ వీడియో కాంటా లగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి, మోడల్ షఫాలీ జరివాలా (42) గుండె పోటుతో మరణించారు. షఫాలీ జరివాలా శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురికాగా.. వెంటనే ఆమె భర్త పరాగ్ త్యాగి అంధేరిలోని బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం కోసం షఫాలీ మృతదేహాన్ని కూపర్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయాన్ని షఫాలీ కుటుంబ సభ్యులు ఇంకా ధ్రువీకరించలేదు.
2002లో విడుదలైన ఐకానిక్ మ్యూజిక్ వీడియో ‘కాంటా లగా’తో షఫాలీ జరివాలా ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ఆ సాంగ్‌తో కుర్రకారు మదిని దోచేశారు. దాంతో ఆమెను కాంటా లాగా గర్ల్‌గా పిలవడం ప్రారంభించారు. సాంగ్ అనంతరం సల్మాన్ ఖాన్ ‘ముజ్సే షాదీ కరోగా’ చిత్రంలో షఫాలీ ఓ పాత్ర చేశారు. ఆపై పలు టీవీ రియాలిటీ షోలు చేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హిందీ బిగ్‌బాస్ 13లో పాల్గొన్నారు. రియాలిటీ షో ‘నాచ్ బలియే’ సీజన్ 5లో పాల్గొన్నారు.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
- Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
షఫాలీ జరివాలా 1982 డిసెంబర్ 15న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. ఆమె తండ్రి పేరు సతీష్ జరీవాలా, తల్లి పేరు సునీతా జరీవాలా. 2014లో షెఫాలీ టీవీ సీరియల్ నటుడు ప్రాగ్ త్యాగిని వివాహం చేసుకున్నారు. మూడు రోజుల క్రితం షఫాలీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చివరి పోస్ట్ చేశారు. అందులో ఆమె తన ఫొటోస్ పోస్ట్ చేసి.. ‘బ్లింగ్ ఇట్ ఆన్ బేబీ’ అనే క్యాప్షన్ ఇచ్చారు. షఫాలీ మృతి పట్ల ప్రముఖ గాయని మికా సింగ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సంతాపం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
-
Toxic Mallareddy Event : టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్లక్ష్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు నమోదు..
-
Kareena Kapoor: మూడోసారి గర్భవతా?.. వైరల్ రూమర్స్‌పై కరీనా కపూర్ ఫన్నీ రియాక్షన్!
-
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్‌లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!