నటి, మోడల్ షఫాలీ జరివాలా (42) గుండె పోటుతో మరణించారు. షఫాలీ జరివాలా శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురికాగా.. వెంటనే ఆమె భర్త పరాగ్ త్యాగి అంధేరిలోని బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం కోసం షఫాలీ మృతదేహాన్ని కూపర్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయాన్ని షఫాలీ కుటుంబ సభ్యులు ఇంకా ధ్రువీకరించలేదు. 2002లో విడుదలైన ఐకానిక్ మ్యూజిక్ వీడియో ‘కాంటా లగా’తో షఫాలీ జరివాలా ఒక్కసారిగా…