KA Paul: చంద్రబాబు అరెస్ట్‌పై ఇలా స్పందించిన కేఏ పాల్.. ఏంటి? మీ మ్యాచ్ ఫిక్సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడంపై స్పందించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు దోచుకున్నాడని జగన్.. వైఎస్ జగన్ దోచుకున్నాడని చంద్రబాబు.. ఏంటి? మీ మ్యాచ్ ఫిక్సింగ్ అని నిలదీశారు. నరేంద్ర మోడీ, అమిత్‌షా, అదానీల తొత్తులా మీరు? అని ఫైర్ అయ్యారు. చంద్రబాబు అవినీతికి పాల్పడాడు గనుకే అరెస్టు అయ్యారని వ్యాఖ్యానించారు. బాబు రావాలను అంటున్నారు.. ప్రత్యేక హోదా తేలేకపోయారు.. కియా తప్పా మరే కంపెనీ తేలేకపోయారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు అంబేద్కర్, మహాత్మా గాంధీ అంటా.. లోకేష్ భగత్ సింగ్ అట అంటూ ఎద్దేవా చేశారు. దోచుకున్నవాళ్లు దేశనాయకులంట.. చాలా దారుణం అంటూ విరుచుకుపడ్డారు పాల్..
ఇక, బాయ్ బాయ్ మోడీ, బాయ్ బాయ్ బాబు.. బాయ్ బాయ్ జగన్ అంటూ హాట్ కామెంట్లు చేశారు ప్రజాశాంతి పార్టీ అధినేత.. గతంలో ఫార్మా కంపెనీలకు కాలుష్యంపై ఓ హెచ్చరిక జారీచేశాను.. విజయనగరం ప్రజలకు సాయం అందించడంలేదని చెప్పాను.. కెమికల్స్ ద్వారా గాలి, నీరు కాలుషితంగా తయ్యారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పొలిటికల్ కరెప్సన్ బాగా పెరిగిపోయింది.. పద్దెనిమిది కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి.. కానీ, లాభంలో పదో అయిదు శాతం ప్రజల కోసం ఖర్చు చేయాలన్న ఆలోచన లేదన్నారు. కనీసం 5 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వ లేరా..? అని నిలదీశారు. నేను పోరాటం చేస్తే అన్నీ భూస్థాపితమైపోతాయి.. అందుకే ప్రజాశాంతి పార్టీ పెట్టాను అని చెప్పుకొచ్చారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
42 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా, కరోనా సమయంలో నిరాహారదీక్ష చేపట్టి పదోతరగతి పరీక్షలు ఆపాను అని చెప్పుకొచ్చారు కేఏ పాల్.. ఇక, ఫ్యామిలీ రూల్ ని ఆపుదాం అందరూ ముందుకు రండి అని పిలుపునిచ్చారు. బీసీ బానిసలారా, ఎస్సీ, ఎస్టీ బానిసలారా..? ముందుకు రండి.. బడుగు బలహీన వర్గాల ప్రజలు.. ప్రజాశాంతి పార్టీని కోరుకుంటున్నాయి.. మీరూ ముందుకు రండి అని పిలుపునిచ్చారు పాల్.. ఇక, స్టీల్ ప్లాంట్ కోసం ఎవరైనా ప్రజా ప్రతినిధులు తమ పదవికి రాజీనామా చేశారా..? అని ప్రశ్నించారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!