Site icon NTV Telugu

KA Paul: కేంద్రపాలిత ప్రాంతంగా తిరుపతి?

Ka Paul

Ka Paul

KA Paul: తిరుపతి లడ్డు వివాదాన్ని అర్థం చేసుకున్నందుకు సుప్రీంకోర్టుకు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ హైకోర్టులో సీబీఐతో విచారణ జరపాలని కేసు వేశానన్నారు. తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని కూడా కలుస్తానని ఆయన పేర్కొన్నారు.పవన్‌తో పాటూ పలువురు నేతలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. పవన్ ఏమన్నా మాట్లాడితే తాట తీస్తా అంటాడన్నారు. తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించానన్నారు. దొంగలే దొంగల్ని విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయా అంటూ కేఏ పాల్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. హైడ్రాపై రేవంత్ రెడ్డితో మాట్లాడానని కేఏ పాల్ తెలిపారు.

Read Also: Mynampally Hanumantha Rao: మైనంపల్లి ప్రాణత్యాగానికైనా సిద్ధం.. మీరు రెడీనా?

వాటికన్ సిటీని ప్రత్యేక దేశంగా చేసినప్పుడు.. లక్షల కోట్ల భక్తులు ఉన్న తిరుపతిని ఎందుకు కేంద్ర పాలిత ప్రాంతం ఎందుకు చెయ్యకూడదని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు లా అండ్ ఆర్డర్ ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో హైడ్రాతో అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో తిరుమల వివాదంపై పిల్ వేశానన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తిరుపతి లడ్డూ గురించి మాట్లాడొద్దన్నారు. సిట్ విచారణ వేయడం ఏంటని.. సీబీఐ విచారణ జరగాలన్నారు. కల్తీ జరగలేదని.. రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. నేను భారతీయున్ని, క్రీస్తు ఫాలోవర్ ను.. ప్రపంచ శాంతిని కోరుకుంటున్నానన్నారు. హ్యుమానిటీ ముందు.. మతం తర్వాత అని అన్నారు. తిరుమల లడ్డు వివాదం దేశం దాటి, విదేశాల్లో చర్చ జరుగుతోందన్నారు.

 

Exit mobile version