తెలుగు రాజకీయాలకు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన ముడి సరకుగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన సంస్థను పరిరక్షించడంలో ఛాంపియన్స్ అనిపించుకోవాలని పార్టీలు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. బీఆర్‌ఎస్ ఎంట్రీ ఏపీ పార్టీలను డిఫెన్స్‌లోకి నెట్టేసింది.ఆ తర్వాతి నుంచి ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. కొత్త కలయికలు కనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి కలయికే ఒకటి జరగ్గా…..వాళ్ళిద్దరూ పరస్పర విరుద్ధమైన వ్యక్తులు కావడం చర్చకు కారణం అయింది. ఆ ఇద్దరిలో ఒకరు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ కాగా….మరొకరు CBI మాజీ జేడీ లక్ష్మీ నారాయణ. వీళ్ళిద్దరూ కలిసి స్టీల్ ప్లాంట్ పూర్వ వైభవానికి తెగ ప్రయత్నిస్తున్నారు.
కేఏ పాల్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన చేసే కామెంట్లు కాకరేపుతూ ఉంటాయి. తాజాగా ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఫోకస్ పెట్టారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వచ్చిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ కొనే స్థోమత తనకు మాత్రమే ఉందన్నారు కేఏ పాల్. అన్ని పార్టీలు కలిసి వస్తే… స్టీల్ ప్లాంట్ ను కొందాం అన్నారు.
Read Also:Rahul Gandhi: నిజం మాట్లాడినందుకు మూల్యం.. బంగ్లా ఖాళీ చేసిన రాహుల్
నర్సీపట్నంలో ఉన్న తన తండ్రిని చూసేందుకు వచ్చిన కె ఏ పాల్ అక్కడినించి తిరిగి వెళుతూ మార్గమధ్యంలో మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ కొనే స్తోమత నా ఒక్కడికే ఉందని, ఏడాది కాలంగా కమిటీలను లెటర్ ఇమ్మని అడుగుతున్నా అన్నారు కేఏపాల్. చంద్రబాబు, జగన్ లు ఇద్దరూ పరిపాలనలో ఫెయిలయ్యారు. నన్ను ముఖ్యమంత్రిని చేస్తే అమరావతి పూర్తి చేస్తా అన్నారు. నేను ఈ ప్రాంతంలో పుట్టి.. అభివృద్ధి చేసిన వాడిని. సింగరేణిని కాపాడుకోలేని కెసిఆర్ స్టీల్ ప్లాంట్ ని ఎలా కొనగలడు? అని ఎద్దేవా చేశారు కేఏ పాల్. మరోవైపు 45 వేల కోట్ల రూపాయల విదేశీ నిధులు తెచ్చి ప్రయివేటీకరణను అడ్డుకుంటానని పాల్ హడావిడి చేస్తున్నారాయన. పాల్ లాంటి వ్యక్తి… లక్షల కోట్ల విలువ చేసే ప్లాంట్‌ను కొనేయడం పెద్ద లెక్క కాదని మాట్లాడడం అంత పెద్ద మేటర్ కాదంటున్నారట పరిశీలకులు. నిజంగా పాల్ కి అంత శక్తి ఉంటే.. ముందు ఆ పని చేయమంటున్నారు.
Read Also: Rahul Gandhi: నిజం మాట్లాడినందుకు మూల్యం.. బంగ్లా ఖాళీ చేసిన రాహుల్