బెట్టింగ్ యాప్స్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ పాల్ అన్నారు. బెట్టింగ్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్‌ల వల్ల వేల మంది చనిపోయారని గుర్తు చేశారు. లక్షలు, కోట్లు అప్పులు చేస్తూ.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలను అడ్డుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చిందని తెలిపారు. సిగరెట్ తాగితే హానికరం అని ఉంటుందని.. స్మోకింగ్ కంటే మిలియన్ టైమ్స్ బెట్టింగ్ యాప్స్ డేంజర్ అని కే.ఏ పాల్ అన్నారు.
READ MORE: Maternity Leave: “ప్రసూతి సెలవులు” మహిళల హక్కుల్లో అంతర్భాగం: సుప్రీంకోర్టు..
1100లకు పైగా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ కోసం ప్రమోషన్ చేస్తున్నారని.. బెట్టింగ్ యాప్స్‌ను కోట్ల రూపాయలు తీసుకుని ప్రమోషన్ చేస్తున్నట్లు కే.ఏ పాల్ తెలిపారు. వీటి వల్ల విష్యత్తులో ఆత్మహత్యలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. మానిలాండరింగ్ జరగకుండా ఉండాలంటే.. బెట్టింగ్ యాప్ లను నిషేధించేలా కేంద్రం చట్టం తీసుకురావాలని కోరారు. ఈ యాప్స్ ప్రమేట్ చేసిన వారిపై తెలంగాణలో కేసులు పెట్టారని.. కానీ ఏం చర్యలు తీసుకున్నారు? అని ఆయన ప్రశ్నించారు. దీంతో పాటు రేపు జరగబోయే శాంతి సదస్సు గురించి కే.ఏ పాల్ మాట్లాడారు. జింఖానా గ్రౌండ్ లో రేపు సాయంత్రం శాంతి సదస్సు ఉందని.. రేపు సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని తెలిపారు.
READ MORE: 2025 Tata Altroz: టాటా ఆల్ట్రోస్ ఫేస్‌లిఫ్ట్ 2025 లాంచ్.. వివిధ వేరియెంట్ ధరలు ఇలా..!