భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సంజీవ్ ఖన్నా మే 13, (మంగళవారం)న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా భారత సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన స్థానంలో సీనియర్ న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ (BR) గవాయి నియమితులవుతారు. రేపు భారత 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు జస్టిస్ బి.ఆర్ గవాయి. రేపు ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ప్రమాణస్వీకారం చేయనున్నారు జస్టిస్ బిఆర్ గవాయ్. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
Also Read:Thug Life : రికార్డ్ ధర పలికిన తగ్ లైఫ్.. టెలివిజన్ రైట్స్
మరికాసేపట్లో సుప్రీంకోర్టు హాల్ లో ప్రదాని న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వీడ్కోలు ఇవ్వనున్నారు సీనియర్ అడ్వకేట్లు. ప్రదాని న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా కోర్టు హాల్ లో 10.30 గంటలకు మాట్లాడే అవకాశం ఉంది. సాయంత్రం 4.15 గంటలకు “బార్ అసోసియేషన్” ఆధ్వర్యంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా కు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా జనవరి 18, 2019న భారత సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.
Also Read:Road Accident: పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం!
ఆయన నవంబర్ 10, 2024న సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ ఖన్నా 17 జూన్ 2023 నుంచి 25 డిసెంబర్ 2023 వరకు సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ (SCLSC) ఛైర్మన్‌గా, 26 డిసెంబర్ 2023 నుండి 10 నవంబర్ 2024 వరకు NALSA ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్నారు. జూన్ 24, 2005న, జస్టిస్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఫిబ్రవరి 20, 2006న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.