కమల్ హాసన్- మణిరత్నం కాంబోలో వస్తోన్న గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్‌పై భారీ హైప్,హోప్ ఉన్నాయి కోలీవుడ్ సినీ సర్కిల్లో. ఎన్నో ఏళ్ల తర్వాత లెజండరీ యాక్టర్ అండ్ డైరెక్టర్ కొలబ్రేట్ కావడంతో పాటు రిలీజ్ చేసిన టీజర్ ఎక్స్ పర్టేషన్స్ ఎవరెస్ట్ తాకుతున్నాయి. జూన్ 5న రాబోతున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇప్పటికే సినిమా లెవల్లో సోల్డ్ అయ్యాయి. సుమారు రూ. 150 కోట్ల భారీ ఎమౌంట్ పెట్టి హక్కులు తీసేసుకుంది నెట్ ఫ్లిక్స్. ఇప్పటి వరకు కమల్ సినిమానే హయ్యెస్ట్ రేటుకు అమ్ముడై రికార్డ్స్ సృష్టించింది.
Also Read : Lavanya Tripathi : సతీ లీలావతి’ డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభం
ఇప్పుడు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ డీల్ క్లోజ్ చేశారు మేకర్స్. ఊహించిన దానికంటే ఎక్కువ ధరకు ఈ రైట్స్ అమ్ముడయ్యాయి. కోలీవుడ్ ప్రముఖ ఛానెల్ విజయ్ టీవీ తగ్ లైఫ్ రూ. 60 కోట్లకు కొనుగోలు చేసింది. కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండా ఈ ధర అంటే రికార్డ్ ధర అనే చెప్పాలి. కోలీవుడ్ యంగ్ హీరో శింబు, మరొక యంగ్ హీరో అశోక్ సెల్వన్, స్టార్ హీరో హీరోయిన్ త్రిష, అభిరామి తదితరులు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 5న పాన్ ఇండియా బాషలలో విడుదల కానుంది. దాదాపు 38 ఏళ్ళ తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో సినిమా వస్తుండంతో ఈ సినిమాకు అటు డిజిటల్, ఇటు శాటిలైట్ భారీ ధర వెచ్చించాయి.