Kaleshwaram: నేడు రాష్ట్రానికి జస్టిస్ పీసీ ఘోష్.. రేపు మేడిగడ్డలో ఉత్తమ్ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaleshwaram: జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేడు హైదరాబాద్ రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న ఆయన నేడు నగరానికి రానున్నారు. 7, 8 తేదీల్లో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలిస్తారు. బ్యారేజీల మరమ్మతు, పునరుద్ధరణ పనులను ఈ నెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే బ్యారేజీలను నిపుణుల కమిటీ కూడా పరిశీలించింది. పనులు ఎంతవరకు జరిగాయో తెలుసుకునేందుకు పీసీ ఘోష్ క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.
మరోవైపు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు కడెం ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రేపు (శుక్రవారం) పరిశీలించనున్నారు. కడెం ప్రాజెక్టు మరమ్మతులకు ప్రభుత్వం రూ.3.81 కోట్లు కేటాయించగా, ఆ నిధులతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మంత్రి ఉత్తమ్ పనులను పరిశీలించి తగు సూచనలు చేయనున్నారు. ఆ తర్వాత సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను కూడా పరిశీలిస్తారు.
Also Read
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
Read also: Raashii Khanna: తడి అందాలతో టెంప్ట్ చేస్తున్న రాశి ఖన్నా
కాగా, మేడిగడ్డ బ్యారేజీలోని 16, 17వ నంబర్ గేట్లను బలవంతంగా ఎత్తివేసే ప్రక్రియను ఇవాళ చేపట్టనున్నారు. ఈ మేరకు ఈఎన్సీ (జనరల్) గుమ్మడి అనిల్ కుమార్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ) ఓరుగంటి మోహన్ కుమార్‌తో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. రేపు (శుక్రవారం) మంత్రి ఉత్తమ్, న్యాయమూర్తి పీసీ ఘోష్ వస్తున్నందున అక్కడే ఉండి ఏర్పాట్లు చేయనున్నారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు 54 ఫిర్యాదులు అందాయి.
కమిషన్ తరపున మే 31లోగా కమిషన్ కార్యాలయానికి నోటరీ ద్వారా అఫిడవిట్ రూపంలో ఫిర్యాదు చేయాలని నీటిపారుదల శాఖ బహిరంగ ప్రకటన విడుదల చేసింది. గడువు ముగిసిన తర్వాత వచ్చిన ఫిర్యాదుల సంఖ్యను లెక్కిస్తే 54 అని తేలింది. ఇదిలా ఉండగా బ్యారేజీల నిర్మాణంలో నిర్ణయాత్మక పాత్ర పోషించిన అధికారులు, ఇంజినీర్లు, మాజీ ప్రజాప్రతినిధులకు రెండు లేదా మూడో వారంలో కమిషన్ నోటీసులు ఇచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.
Tejashwi Yadav: నితీశ్ కింగ్ మేకరే అయితే బిహార్‌కు స్పెషల్ స్టేటస్ తేవాలి..!
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!