Justice NV Ramana: తెలుగు భాష సంగీతమైనటువంటి భాష అని.. ఈ మధ్యకాలంలో తెలుగు భాషపై దాడి జరిగిందని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలుగు భాషపై పట్టు వీడుతుందన్నారు. రాజకీయ నాయకులు సంక్షేమ అభివృద్ధి గురించి ఆలోచిస్తారు కానీ భాష గురించి ఆలోచించరన్నారు. కొంతమంది ముఖ్యమంత్రులు మాత్రమే తెలుగు భాష గురించి పట్టించుకున్నారన్నారు. కడప నగరంలోని సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో జరిగిన జానుమద్ధి హనుమచ్ఛాస్త్రి శతజయంతి వేడుకలకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. జానుమద్ధి హనుమచ్ఛాస్త్రికి ఘనమైన నివాళి అర్పించారు. విదేశీయుడైన బ్రౌన్ తెలుగు భాష గురించి చేసిన కృషి అభినందనీయమన్నారు. కడప పట్టణంలో ఇలాంటి లైబ్రరీ ఏర్పాటు చేసిన శాస్త్రి గారి కృషి అభినందనీయమన్నారు.
Read Also: YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. కడప కార్పొరేషన్‌లో ఏడుగురు కార్పొరేటర్లు జంప్!
విదేశీ ఉద్యోగాల కోసం తెలుగు భాషను మరిచిపోవడం జరుగుతుందన్నారు. ఇది తెలుగు భాషా సమాజం మీద ప్రభావం చూపుతుందన్నారు. మాతృభాషను పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే ఏ భాష పైన పట్టు వస్తుందన్నారు. విదేశాలలో వారి మాతృభాషకే వారు ప్రాధాన్యత ఇస్తారన్నారు. ఏ భాష నేర్చుకున్న మాతృభాషను మరువరాదన్నారు. భాష అనేది అక్కడి సంస్కృతిని తెలియజేస్తుందని వెల్లడించారు. ప్రభుత్వాలు విద్యావిధానాలలో పలుమార్పులు తీసుకొస్తున్నారని చెప్పారు. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి అని అనుకోవడం పొరపాటన్నారు. ఉద్యోగ అవకాశాలకు భాషకు సంబంధం లేదన్నారు. ఇటీవల కాలంలో ఓ ప్రభుత్వం తెలుగు భాషను తీసివేసి ఆంగ్ల భాషను విద్యాభాషగా చేయాలని ప్రయత్నం చేసిందన్నారు. రాష్ట్రంలో పాత విద్యావిధానాన్ని కొనసాగించాలని ఇప్పటి ముఖ్యమంత్రిని విద్యాశాఖ మంత్రిని కోరామన్నారు.
Read Also: Water Society Polls: సాగునీటి సంఘం ఎన్నికల్లో అధికారిపై కత్తితో దాడి.. ఎన్నికలు వాయిదా
రాష్ట్రంలో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేసి దానిని అభివృద్ధి చేయాలని సూచించారు. మన దేశంలో ఉన్న తెలుగు ప్రజల కన్నా విదేశాలలో ఉన్న తెలుగు ప్రజలు సంస్కృతి సంప్రదాయాలు పాటిస్తున్నారన్నారు. రెండు రాష్ట్రాలలో తెలుగు భాషను రెండో భాషగా కోరవలసి వస్తుందన్నారు. పక్క రాష్ట్రాలలో వారు తమ భాష కోసం ఎంత కృషి చేస్తున్నారో వారిని చూసి నేర్చుకోవాలన్నారు. మన తెలుగు భాషను మనమే పరిరక్షించుకోవాలన్నారు.ఒక తెలుగు మాస్టారు ఎన్నో జీవితాలను ప్రభావితం చేస్తాడన్నారు. ఇతర రాష్ట్రాలలో దేశాలలో వారు తమ భాషలో తప్ప ఇతర భాషలో సమాధానం చెప్పరన్నారు. కడపకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని.. తాను వీధి బడిలో చదువుకొని ఈ స్థాయికి వచ్చానన్నారు. గొప్పవాడు కావాలంటే ఇంగ్లీషు ఒక్కటి ప్రామాణికం కాదన్నారు. దేశంలో గొప్పవారు తెలుగు బడిలో చదువుకునే పైకి వచ్చినవారేనని మాజీ సీజేఐ జస్టి్స్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.