తెలుగు భాష సంగీతమైనటువంటి భాష అని.. ఈ మధ్యకాలంలో తెలుగు భాషపై దాడి జరిగిందని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలుగు భాషపై పట్టు వీడుతుందన్నారు. రాజకీయ నాయకులు సంక్షేమ అభివృద్ధి గురించి ఆలోచిస్తారు కానీ భాష గురించి ఆలోచించరన్నారు. కొంతమంది ముఖ్యమంత్రులు మాత్రమే తెలుగు భాష గురించి పట్టించుకున్నారన్నారు.