Krishna River: కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత
- పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ..
- జూరాల ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తివేత..
- శ్రీశైలం డ్యామ్ ఐదు గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల..
- నాగార్జున సాగర్ లో 22 క్రస్ట్ గేట్లు ఎత్తివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishna River: కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతుంది.. వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలోని కృష్ణాబేసిన్‌లోని అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు… జూరాలకు వరద కొనసాగుతుండగా.. 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో 71,713 వేల క్యూ సెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 76,667 క్యూ సెక్కులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 1045 ఫీట్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1043.865 ఫీట్లుగా ఉంది.. జూరాల పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు అయితే.. ప్రస్తుత నీటి నిల్వ 8.949 టీఎంసీలుగా ఉంది.. ఇక, ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రలలో 11 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు.. ఎత్తి పోతల పథకాలకు కూడా నీటి విడుదల చేస్తున్నారు.
Read Also: Israel-Hamas: ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి చర్చలు.. త్వరలోనే కాల్పుల విరమణ
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఇక, శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది.. జలాశయం 5 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేశారు అధికారులు.. ఇన్ ఫ్లో 1,59,089 క్యూసెక్కులు అయితే.. ఔట్ ఫ్లో 2,07,820 క్యూసెక్కులుగా ఉంది.. పూర్తి్స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 885 అడుగులు ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం నీటినిల్వ 215.8070 టీఎంసీలకు చేరి నిండుకుండలా మారింది శ్రీశైలం.. ఇక, కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంతో పాటు ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలోనూ విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు..
Read Also: Israel-Hamas: ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి చర్చలు.. త్వరలోనే కాల్పుల విరమణ
మరోవైపు.. శ్రీశైలం డ్యామ్ నుంచి పెద్దస్థాయిలో నీటి విడుదలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.. దీంతో.. 22 క్రస్ట్ గేట్స్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో 2,08,863 క్యూసెక్కులు అయితే.. ఔట్ ఫ్లో 2,25,463 క్యూసెక్కులుగా ఉంది.. ప్రస్తుత నీటి మట్టం 589.70 అడుగులు కాగా.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉంది.. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 311.4886 టీఎంసీల నీరు ఉంది.. నాగార్జున సాగర్ నుంచి గేట్ల ద్వారా నీటి విడుదలతో పాటు పంట కాల్వలకు కూడా నీటిని వదులుతున్నారు అధికారులు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!