శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని మంత్రి జూపల్లి హెచ్చరించారు. పాలమూరు రైతాంగానికి నష్టం చేయొద్దని, నష్టం జరిగితే ఊరుకోమన్నారు. 64 శాతం తెలంగాణకు వాటా ఉందని.. ఏపీ ప్రభుత్వం అక్రమాలకు పాలపడొద్దన్నారు. ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తోందని ఆయన మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిందని.. పవర్ జనరేషన్ నిలిపివేయాలని నిబంధన ఉందన్నారు. తాగడానికి కూడా నీళ్లు లేకుండా చేస్తారా? అని ప్రశ్నించారు. తాము ధర్నా చేస్తాం అనే వరకు నీళ్లు దోచుకుందని.. ఏపీ ఇప్పుడు ఆపిందని మంత్రి జూపల్లి ఫైర్ అయ్యారు.
Also Read: Abandoned Baby: ముల్లపొదల్లో వదిలేసిన పసికందుకు కొత్త జీవితం!
ఈరోజు మంత్రి జూపల్లి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘శ్రీశైలం ప్రాజెక్టు నీటి లెవెల్స్ తగ్గాయి. పవర్ జనరేషన్ నిలిపేయాలని నిబంధన ఉంది. తాగు నీటి అవసరాల కోసం మాత్రమే వాడాలి. దీనికి భిన్నంగా అక్రమంగా ఏపీ నీటిని వాడుతుంది. 2012లో కూడా ఇలాగే చేశారు, అప్పుడు కోర్టులో కేసు వేశా నేను. అక్రమంగా నీటిని ఏపీ తరలించుకుంటుంది. తాగడానికి కూడా నీళ్ళు లేకుండా చేస్తారా?. మేం ధర్నా చేస్తాం అనే వరకు నీళ్లు దోచుకుంది. ఏపీ ఇప్పుడు ఆపింది. పాలమూరు రైతాంగానికి నష్టం చేయొద్దు, నష్టం జరిగితే ఊరుకోం. 64 శాతం తెలంగాణ కు వాటా ఉంది. ఖమ్మం, నల్గొండ, పాలమూరు జిల్లా రైతుల హక్కులు కాలరాస్తే ఊరుకోం. ఏపీ ప్రభుత్వం అక్రమాలకు పాలపడొద్దని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఇక ఉపేక్షించదు’ అని మంత్రి అన్నారు.
